fingers : జ్యోతిష్య శాస్త్రంలో మనకున్న అలవాట్ల గురించి ఎంతో చక్కగా వివరించారు. ఈ అలవాట్లు ఏదో ఒక గ్రహంతో ఏదో ఒక విధంగా సంబంధాన్ని కలిగి ఉంటాయి అంటున్నారు జ్యోతిష్యులు. దీనివల్ల మనకు శుభ లేదా అశుభ ఫలితాలు కలుగుతాయట. కొన్ని అనుకోని సంఘటనలు కూడా గ్రహాల వల్లనే సంభవిస్తాయి అంటున్నారు నిపుణులు. ఇక కొన్ని అలవాట్లు రాహువును బలహీనపరుస్తాయట. అలాగే మనకు చెడు జరిగేలా చేస్తుంటాయని నమ్ముతున్నారు పండితులు. చాలా మందికి ఉండే అలవాట్లలో గోర్లను రుద్దడం ఒకటి. చాలా మంది ఆడవాళ్లు వారి గోర్లను తరచుగా రుద్దుతూనే ఉంటారు. ఇలా గోర్లను రుద్దితే సంపద పెరుగుతుంది అని నమ్ముతారు. మరి ఇందులో నిజంగానే నిజం ఉందా? లేదా అనే వివరాలు తెలుసుకుందాం.
గోళ్లను రుద్దితే సంపద పెరుగుతుంది అంటారు చాలా మంది. మరి మీరు దీన్ని నమ్ముతున్నారా? అయినా కేవలం గోర్లను రుద్దడం వల్ల సంపద పెరుగుతుంది అంటే 24 గం.లు నిద్రాహారాలు మానేసి మరీ గోర్లను రుద్దుతూ కూర్చొంటారు చాలా మంది. అయితే ప్రతి ఒక్కరి వేళ్లలో గ్రహాలు నివసిస్తుంటాయట. వేళ్లను దేనికి ఉపయోగిస్తామో దాన్ని బట్టి శుభ లేదా అశుభ ఫలితాలు జరుగుతుంటాయి. గ్రహాలే మనకు మంచి జరగాలా? చెడు జరగాలా? అనేదాన్ని నిర్ణయిస్తాయి అంటున్నారు పండితులు.
చేతులను, వేళ్లను ఎన్నో పనులకు ఉపయోగిస్తుంటాము. తినడానికి, తాగడానికి, శుభ్రం చేసుకోవడం, పనులు చేయడం ఇలా ఎన్నో పనులకు ఈ వేళ్లను, చేతులను ఉపయోగిస్తుంటాం. కానీ వీటివల్ల ఎలాంటి చెడు జరగదు. కానీ గోర్లను పదే పదే రుద్దే అలవాటు ఉంటే మాత్రం తక్షణమే మానుకోవాలి అంటున్నారు జ్యోతిష్యులు. ఈ అలవాటు మంచిది కాదట. అయితే చాలా మందికి గోర్లను రుద్దడం ఒక అలవాటుగా ఉంటుంది.ఇలా చేయడం వల్ల గ్రహాలు మేల్కొని తమ ప్రభావాన్ని నేరుగా చూపిస్తాయట. దీని వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
మధ్య వేలిలో శని, ఉంగర వేలిలో సూర్యుడు, చిన్న వేలిలో బుధుడు, చూపుడు వేలిలో బృహస్పతి, బొటనవేలులో శుక్రుడు నివసిస్తుంటారు. ఈ వేళ్లను రుద్దితే ఈ గ్రహాల పవిత్రత బహిర్గతమవుతుందని నమ్ముతున్నారు పండితులు. అయితే రెండు చేతుల వేళి గోర్లను కలిపి రబ్ చేస్తే గ్రహాలన్నీ దృఢంగా మారుతాయట. అందుకే ప్రతి గ్రహం ప్రభావం వేర్వేరుగా కూడా పడే అవకాశం ఉందట. అంతేకాదు ఈ గ్రహాలు మీ మీద విభిన్నంగా ప్రభావాన్ని చూపిస్తాయి.
అయితే వేళ్లను రబ్ చేస్తే సంపద పెరుగుతుంది అనడాన్ని కొందరు కొట్టిపారేస్లే మరికొందరు మాత్రం వేళ్లను రబ్ చేయడం వల్ల నిజంగా సంపద పెరుగుతుంది అంటున్నారు. అంతేకాదు ఇల్లు సుఖసంతోషాలతో నిండి ఉంటుంది అంటున్నారు జ్యోతిష్యులు. మీ జీవితంలో ఎంతో పురోభివృద్ధిని సాధిస్తారట కూడా. కానీ దీనివల్ల ఈ శుభాలు జరగాలంటే మాత్రం బ్రహ్మముహూర్తంలోనే వేళ్లను రుద్దాలి అంటున్నారు నిపుణులు. అప్పుడే ఈ ఫలితాలు మీకు లభిస్తాయి.