Homeఎడ్యుకేషన్Study Tips: చదివిన పాఠాలు వెంటనే మర్చిపోతున్నారా... అయితే ఈ చిట్కాలు పాటించండి!

Study Tips: చదివిన పాఠాలు వెంటనే మర్చిపోతున్నారా… అయితే ఈ చిట్కాలు పాటించండి!

Study Tips: పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులలో ఆందోళన పెరుగుతోంది. ఈ క్రమంలోనే విద్యార్థులు అధికంగా ఆందోళన చెందటం వల్ల చదివినవి మర్చిపోతుంటారు. అయితే ఇలా బాగా చదివిన పాఠాలు కూడా తరచూ మరిచిపోతూ ఉంటే మీరు చదివే విధానంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం చదివిన పాఠాలు ఎక్కువ కాలం గుర్తు ఉండాలంటే ఈ చిన్న చిట్కాలను పాటించండి.

Study Tips
Study Tips

*మనం ఏ పాఠమైన లేదా ఏ అంశమైనా చదువుతున్నప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని చదవాలి అంతేకాని బట్టి కొట్టడం వల్ల అప్పటికి మాత్రమే చదివినట్లు అనిపించినా తర్వాత మర్చిపోతారు. కాస్త ఆలస్యమైనా ఆ అంశంపై పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత చదివితే ఎప్పటికీ గుర్తు ఉంటుంది.

* ఏదైనా ఒక పాఠం అర్థం కాకపోతే దానిని వదిలేసి వేరే దానిని చదవాలి. ఇలా అర్థంకాని పాఠం గురించి చదివేటప్పుడు అంత వరకు చదువుకున్న వాటిని కూడా మర్చి పోయే అవకాశాలు ఉంటాయి. అందుకే దానిని వదిలి వేరే పాఠం చదవటం మంచిది.

*విరామం లేకుండా చదవటం వల్ల మన మెదడుకు అధిక ఒత్తిడి కలిగి ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే కాసేపు విరామం తీసుకుంటూ చదవటం మంచిది.

Also Read: నిశ్చితార్థం చేసుకుని.. పెండ్లి క్యాన్సిల్ చేసుకున్న సెల‌బ్రిటీలు వీరే.. కార‌ణాలు తెలిస్తే..!

*పరీక్షలకు రెండు మూడు గంటల ముందే చదవడం ఆపివేసి మనం చదివిన వాటిని రివిజన్ చేసుకోవాలి. ఇక అప్పుడప్పుడు మనం చదువుతున్న వాటిని రివిజన్ చేసుకోవడం వల్ల ఏదైనా మర్చిపోయిన అంశాలను కూడా గుర్తు చేసుకొంటాము.

*ఇక పరీక్షల సమయంలో పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు కూడా కాస్త సమయం కేటాయించి వారి బాగోగులు చూసుకోవాలి. తల్లిదండ్రుల సపోర్ట్ కూడా పిల్లలకు ఎంతో అవసరం. ఈ విధమైనటువంటి చిట్కాలను పాటించడం వల్ల మనం చదివిన విషయాలు ఎక్కువ కాలంపాటు గుర్తుంటాయి.

Also Read: అఖిల్, స్రవంతిలు ముమైత్ ఖాన్ గురించి ఏం మాట్లాడారో తెలుసా?

Recommended Video:

Radhe Shyam Vs Bheemla Nayak Vs Pushpa || Prabhas Vs Pawan Kalyan Vs Allu Arjun || Ok Telugu

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version