Bigg Boss OTT Telugu: తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటీ సంపాదించిన బిగ్ బాస్ షోను OTTలో లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి డిస్నీ హాట్ స్టార్ భారీగా ప్లాన్ చేసింది. ‘నో కామా.. నో ఫుల్ స్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్’ అంటూ బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున దీనిని ప్రారంభించాడు. 24గంటల పాలు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తే.. బాగా కాసులు కురుస్తాయని బిగ్ బాస్ ప్రొడ్యూసర్లు వేసిన అంచనాలు తప్పినట్లు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ కోసం చాలామంది హాట్ స్టార్ మెంబర్ షిప్ తీసుకుంటారని అనుకుంటే, అంచనాలు తలకిందులైనట్లు కనిపిస్తోంది.
అసలు OTT బిగ్ బాస్ షో గురించి జనాల నుండి స్పందన రాలేదు. అసలు చాలామందికి OTTలో బిగ్ బాస్ వస్తోందనే విషయమే తెలియకపోవడం కొసమెరుపు.24గంటల లైవ్ స్ట్రీమింగ్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఊదరగొట్టిన బిగ్ బాస్ షోకు బ్రేక్ పడింది. శనివారం నుండి బుధవారం వరకు ఎలాగోగా నడిచిన బిగ్ బాస్ షో.. బుధవారం అర్ధరాత్రి నుండి లైవ్ స్ట్రీమింగ్ నిలిచిపోయింది.
Also Read: బన్నీ, పవన్, ఎన్టీఆర్ రికార్డులను బద్దలు కొట్టిన ప్రభాస్ !
జనాలను ఆకట్టుకోవడంలో విఫలమైనందుకే డిస్నీ హాట్ స్టార్ లైవ్ స్ట్రీమింగ్ ఆపేసిందని బయట టాక్ నడుస్తుంటే.. మరింత ఆకర్షణీయంగా హౌజ్ ను మార్చడానికి లైవ్ స్ట్రీమింగ్ ఆపినట్లు హాట్ స్టార్ ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి 12గంటలకు తిరిగి లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని హాట్ స్టార్ వెల్లడించింది. ‘ఏరోజుకి ఆరోజు పూర్తి ఎపిసోడ్‌ని రాత్రి 9 గంటలకు విడుదల అవుతుంది. తప్పక చూడండి’ అని హాట్ స్టార్ స్క్రోలింగ్ రన్ చేస్తోంది.
మొత్తం 17మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ OTT ఫిబ్రవరి 26న ప్రారంభమైది. వీరిలో 8మంది కొత్త కంటెస్టెంట్స్ కాగా 9 మంది పాత కంటెస్టెంట్స్ ఉన్నారు. అషురెడ్డి, అరియానా, అఖిల్, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా, సరయు, ముమైత్ ఖాన్, హమీదా, తేజస్వి మాదివాడ గతంలో ప్రసారమైన ఐదు సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్. వీరిని వారియర్స్ గా నాగార్జున పరిచయం చేశారు. ఇక కొత్తగా ఈ షోలోకి ప్రవేశించినవారిని చాలెంజర్స్ గా పరిచయం చేశారు.
Also Read: భీమ్లానాయక్ లో పిచ్చెక్కిస్తున్న త్రివిక్రమ్ డైలాగులు ఇవే.. ఎన్నాళ్లకు గురూజీ..!