https://oktelugu.com/

Work space harassment : వర్క్ స్పేస్ లో లైంగిక ఇబ్బందులకు గురవుతున్నారా.. అయితే ఇలా చేయండి

వర్క్ స్పేస్ లో కూడా మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. మాటలు, చేష్టల వల్ల చాలా మంది మహిళలు ఆఫీసుల్లో ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రతి ఆఫీసులోనూ కూడా మహిళను ఇబ్బంది పెట్టిన వాళ్లకి శిక్షలు ఉంటాయి. వాళ్లను వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేస్తారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 13, 2024 / 11:34 PM IST

    Work space harassment

    Follow us on

    Work space harassment :  ఈరోజుల్లో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లలు నుంచి ముసలి వాళ్ల వరకు అందరూ కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. నిజం చెప్పాలంటే అమ్మాయిలకి సొంత ఇంట్లో కూడా రక్షణ లేదు. అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి పంపాలన్న తల్లిదండ్రులు ఈ రోజుల్లో భయపడుతున్నారు. ఎందుకు అంటే ఎక్కడ చుసిన అమ్మాయిల మీద లైంగిక వేధింపులు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజుల్లో ఎక్కువ మంది అమ్మాయిలు బయటకి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. వర్క్ స్పేస్ లో కూడా మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. మాటలు, చేష్టల వల్ల చాలా మంది మహిళలు ఆఫీసుల్లో ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రతి ఆఫీసులోనూ కూడా మహిళను ఇబ్బంది పెట్టిన వాళ్లకి శిక్షలు ఉంటాయి. వాళ్లను వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. అయితే పని ప్రదేశాల్లో మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తే.. కొన్ని శిక్షలు ఉన్నాయి. అవేంటో మరి తెలుసుకుందాం.

    వర్క్ స్పేస్ లో కొందరు అమ్మాయిలని వేరే ఉద్దేశంతో టచ్ చేస్తుంటారు. శారీరకంగా ఇబ్బందులు పెట్టడం, లైంగిక కోరికలు తీర్చమని అడగడం, వేరే ఉద్దేశంతో మాటలు ఆడటం, మెస్సేజ్ తప్పుగా చేయడం, పోర్న్ వీడియోలు చూపించడం, వర్క్ స్పేస్ లో మహిళలకు ఇబ్బంది పెట్టడం, కోరికలు తీర్చకపోతే బెదిరించడం వంటివి చేస్తుంటారు. ఇలా మహిళలను ఇబ్బంది పెడితే.. లైంగిక వేధింపుల నిరోధక చట్టం ద్వారా వాళ్లకు శిక్ష పడుతుంది. వర్క్ స్పేస్ లో లైంగిక వేధింపులు చేసిన వాళ్లకి ఐపీసీ సెక్షన్ 509 కింద మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుంది. కొందరికి కేవలం ఒక శిక్ష మాత్రమే ఉంటే.. మరి కొందరికి రెండు శిక్షలు ఉంటాయి. అయితే ఆఫీస్ లో కొందరు అమ్మాయి అనుమతి లేకుండా వాళ్లని ఇబ్బంది పెట్టడం, ఫ్లర్టింగ్ చేయడం, తప్పుగా మాట్లాడటం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి చేసిన కూడా ఈ శిక్షలు పడతాయి. అయితే ఇలా చేయడం వల్ల అబ్బాయిల కేరీర్ నాశనం అయిపోతుంది. కాబట్టి కొన్ని సార్లు వాళ్లకి వార్నింగ్ ఇవ్వండి. అప్పటికి మారకుండా ఇంకా ఇబ్బందులు పడుతుంటే.. తప్పకుండా కంప్లెయింట్ ఇవ్వండి. ప్రస్తుతం చాలా ఆఫీసుల్లో కొన్ని కమిటీలు కూడా వేశారు. వీళ్లకి చెప్పిన సమస్య తగ్గుతుంది. కొందరు ఎదుటి వాళ్ల లైఫ్ పోకూడదు అనే ఉద్దేశంతో వాళ్లే సమస్య పరిష్కరించుకుంటున్నారు. కొందరు ఆఫీస్ కూడా మానేస్తున్నారు. ఇలాంటి సమస్యల వల్ల చాలా మంది అమ్మాయిలు వాళ్ల కేరీర్ ను నాశనం చేసుకుంటున్నారు. మంచి కంపెనీ ఉద్యోగం అయిన లైంగిక వేధింపులు తట్టుకోలేక ఉద్యోగాలు మానేస్తున్నారు. అయిన ఎన్ని చట్టాలు ఉన్నా అమ్మాయిల మీద వేధింపులు తగ్గడం లేదు.. రక్షణ కూడా లేదు.