Romance : ‘శృంగారం ఆరోగ్యకరం’ అన్నారు పెద్దలు.. ప్రతీ వ్యక్తి జీవిత భాగస్వామితో కలయిక ఏర్పడినప్పుడు అమితానందం పొందుతాడు. ఈ సమయంలో వచ్చే సంతోషం మరెక్కడా లభించదు. అందుకే చాలా మంది పెళ్లి అనగానే ఎగిరి గంతులేస్తారు. కానీ ఈ కాలంలో కొన్ని అలవాట్లు, ఆలోచనల కారణంగా పెళ్లికి ముందే రతి క్రీడలో పాల్గొంటున్నారు. అయితే పెళ్లయిన తరువాత దంపతుల మధ్య జరిగే శృంగారం గురించి మాట్లాడితే.. వీరి కలయికకు అనువైన సమయం ఏది? అనేది చాలా మందికి సందేహం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో కొందరు రకరకాల ఉద్యోగాలు చేస్తుంటారు. కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేస్తుంటే..మరికొందరు నైట్ షిప్టులు ఎక్కువగా చేస్తుంటారు. ఈ కారణంగా శృంగారంలో పాల్గొనడానికి అందరికీ ఒకే సమయం అనుగవైనది కాదని నిపుణుల అభిప్రాయం. అయితే ఎలాంటి సమయంలో ఈ క్రీడలో పాల్గొనాలంటే?
శృంగారం అనేది ఇద్దరి మనసులు ప్రశాంతంగా ఉన్నప్పుడు పాల్గొనే క్రియ. ఈ సమయంలో భాగస్వాములిద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయతలు ఉన్నప్పుడే ఒకరిపై మరొకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఇద్దరు కలిసి మరింత దగ్గరయ్యే సమయం పడుతుంది. ఇలా ప్రశాంతంగా ఉన్నప్పుడే పడకగదిలోకి వెళ్లడం వల్ల ఆ క్షణాలు స్వర్గంలా కనిపిస్తాయి. అందువల్ల శృంగారంలో పాల్గొనే ముందు ప్రశాంతమైన వాతావరణం ఏర్పరుచుకోవడానికి ప్రయత్నించాలి. ఆ తరువాతే తరువాత క్రియలోకి వెళ్లాలి.
సాధారణంగా చాల మందికి పిల్లలు కలిగిన తరువాత శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది. ఒకవేళ దంపతుల మధ్య కోరికలు ఏర్పడినా పిల్లలు లేని సమయంలో వీరి కలయిక ఉంటే బాగుంటుంది. పిల్లల ముందు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది వారి మనసుపూ చెడు ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఇలాంటి సమయంలో ప్రశాంతమైన వాతావరణం అంటూ ఉండదు. అందువల్ల ఇలాంటి సమయాన్ని వాయిదా వేసుకోవడం మంచింది.
శృంగారంలో స్వర్గం కనిపించాలంటే ఇద్దరి మనస్తత్వాలు ప్రశాంతంగా ఉండాలి. అంటే శృంగారానికి పురుషుడు మాత్రమే సిద్ధంగా ఉంటే సరిపోదు. భాగస్వామి కూడా అందుకు సహకరించాలి. అప్పుడే ఆ వాతావరణం సంతోషంగా గడుస్తుంది. అయితే బలవంతంగా చేయడానికి కొందరు ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వల్ల పురుషుడికి ఆనందం కలిగినా.. భాగస్వామి మనసు నొచ్చుకోవడంతో మరోసారి కలయిక కోసం వ్యతిరేకిస్తుంది.
అనారోగ్య సమయంలో శృంగారానికి దూరంగా ఉండడమే మంచింది. ఇటువంటి సమయంలో కొందరు స్త్రీలల్లో అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఒక్కోసారి గర్భ స్రావం ఏర్పడి అనేక సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వారు పీరియడ్స్ సమయంలో దూరంగా ఉండడమే మంచిది అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవే కాకుండా ఉద్యోగం చేసే స్త్రీలు అలసి పోయినప్పుడు కూడా వారిని బలవంత పెట్టడం మంచిది కాదని కొందరి నిపుణుల అభిప్రాయం. అయితే ఒకవేళ వారు పదే పదే వ్యతిరేకిస్తే మాత్రం పురుషుడు తన దారికి తెచ్చుకోవడనికి కొన్ని సంతోషకరమైన క్రియలు ప్రారంభించారు. ముద్దు, ముచ్చట్లతో వారి మనసును ప్రశాంతంగా మార్చి ఆ తరువాత కామ క్రీడలో పాల్గొనాలి. అప్పుడు స్త్రీ.. పురుషుడితో కలయిక కోసం ఇష్టపడడమే కాకుండా ఒక నమ్మకం ఏర్పడుతుంది.