Viral Video: ప్రపంచం మొత్తం ఒక కు గ్రామం అయిన తర్వాత.. గ్లోబలైజేషన్ అనేది మన జీవితంలో పెను మార్పులకు కారణమైన తర్వాత.. ఉద్యోగాల విషయంలోనూ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అందువల్లే ఫార్మ(Pharma), ఐటి(information technology), ఫైనాన్స్(finance), అగ్రికల్చర్(agriculture), ఎఫ్ఎంసీజీ (fast moving consumer goods), మ్యానుఫ్యాక్చర్ ( manufacture), ఆటోమేషన్ ( automation) వంటి రంగాలలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. అందువల్లే విదేశీ కంపెనీలు కూడా ఈ రంగాలలో విపరీతంగా పెట్టుబడిపెడుతున్నాయి. మనదేశంలో వీటి తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో పని చేసే వారికి లక్షలలో వేతనాలు ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే తమ దేశాలకు పిలిపించుకొని.. మరింత మెరుగైన వేతనాలు ఇస్తూ పనిచేయించుకుంటున్నాయి. అందువల్లే కార్పొరేట్ కంపెనీలలో కొలువులు చేయడానికి.. అందులో కొలువులు సాధించడానికి చాలామంది యువత పోటీ పడుతున్నారు. అందులో పనిచేయడాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు.. భారీగా వేతనాలు సంపాదించి అత్యున్నత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
పైకి అలా ఉండదు
కార్పొరేట్ కంపెనీలలో కొలువు చేయడానికి చాలామంది గొప్పగా భావిస్తుంటారు. అయితే పైకి కనిపించినంత గొప్పగా కార్పొరేట్ కంపెనీలలో కొలువులు ఉండవు. దీనిని బలపరిచే సంఘటనలు అనేకం జరిగాయి. ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తర్వాత దీనిని వెల్లడించే వీడియోలు తామరతంపరగా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తోంది. ఆ వీడియోలో మట్టిని ఎత్తిపోసే ఎక్స్ వేటర్, ఓ గాడిద లాగే బండి ఉన్నాయి. ఎక్స్ క వేటర్ మట్టిని తవ్వి ఆ గాడిద లాగే బండిలో పోసింది. ఆ మట్టిని అనేకసార్లు అలానే పోసింది. ఆ మట్టి బరువుకు ఆ గాడిద ఒకసారిగా పైకి లేచింది. అయినప్పటికీ ఆ గాడిద ముందు ఉన్న ఓ వ్యక్తి.. దానిని కిందికి లాగే ప్రయత్నం చేశాడు.. ఆ గాడిదను కిందికి లాగుతున్న వ్యక్తిని మేనేజర్ అని.. అంతటి మట్టిని మోసే గాడిదను ఎంప్లాయ్ లాగా ఆ వీడియోలో పేర్కొన్నారు. Instagram లో raju_rj_bamniya అనే ఐడిలో ఈ వీడియో పోస్ట్ అయింది. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.. ” నిజమే ఈ వీడియోలో చూపించినట్టు కార్పొరేట్ కంపెనీలో కొలువు అంటే అంత ఈజీ కాదు. గాడిద చాకిరి చేయాల్సి ఉంటుంది. గాడిద చాకిరి చేస్తేనే విలువ ఉంటుంది. లేకుంటే పింక్ స్లిప్ ఇచ్చి బయటికి పంపిస్తారు. ఎంత చాకిరి చేసినా పెద్దగా విలువ ఉండదు. ఉన్నంతసేపు విపరీతంగా వాడుకుంటారు. పేరుకు వేతనం ఇస్తున్నారనే మాటే గాని.. పని మాత్రం ఘోరంగా ఉంటుంది. విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఉద్యోగాలు కూడా మానేస్తారు. ఇక క్రైసిస్ పేరు చెప్పి చాలామందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులతో ఆడుకుంటాయి. అదే ఉద్యోగులతో పని చేయించుకుని అంతకంతకు ఎదుగుతాయని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
View this post on Instagram