https://oktelugu.com/

Dussehra : జీవితంలో డబ్బుకు లోటు ఉండకూడదు అంటే దసరా రోజు ఈ పరిహారాలు చేయండి

ఈ రోజున శుభకార్యాలు చేసుకోవడం, వాహనాలు కొనుగోలు చేయడం, ఇతరత్రా వస్తువులునుగోలు చేయడం చాలా మంచిదని విశ్వసిస్తారు ప్రజలు. అంతేకాదు ఈ రోజున చేసే కొన్ని ఖచ్చితమైన చర్యలు జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని తెచ్చిపెడతాయి అంటున్నారు పండితులు.

Written By: Swathi Chilukuri, Updated On : October 8, 2024 3:40 pm
Dussehra

Dussehra

Follow us on

Dussehra : దసరా వచ్చిందంటే చాలు వాకిళ్లు, ఇల్లులు అందంగా ముస్తాబు అవుతుంటాయి. ఇక ఆడపిల్లల మొహంలో పట్టలేని సంతోషం వస్తుంది. సాయంత్రం అయిందంటే చాలు పూలు తెప్పుకొని వచ్చి ఎంతో అందంగా బతుకమ్మను ముస్తాబు చేసి డీజే పాటలు, ఉయ్యాల పాటలతో నృత్యాలు చేస్తుంటారు. ఇక  ఈ ఏడాది దసరా శనివారం 12 అక్టోబర్ 2024న జరుపుకో బోతున్నారు. ఈ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా పరిగణించారు. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిందని చెబుతున్నాయి పురాణాలు. అంతేకాదు ఈ రోజున శ్రీ రాముడు లంకాధీసుడు రావణుడిని సంహరించి రావణుని చెర నుంచి సీతాదేవిని విడిపించి తీసుకొని వచ్చాడని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శుభకార్యాలు చేసుకోవడం, వాహనాలు కొనుగోలు చేయడం, ఇతరత్రా వస్తువులునుగోలు చేయడం చాలా మంచిదని విశ్వసిస్తారు ప్రజలు. అంతేకాదు ఈ రోజున చేసే కొన్ని ఖచ్చితమైన చర్యలు జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని తెచ్చిపెడతాయి అంటున్నారు పండితులు.

దసరా రోజున జమ్మి వృక్షానికి సంబంధించిన పరిహారాలు చేయడం చాలా మంచిది అంటున్నారు పండితులు. నవమి రోజు రాత్రి జమ్మి చెట్టు దగ్గర చిన్న పరిష్కారం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయట. ఈ రోజు జమ్మి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఏవనా న్యాయపరమైన సమస్యలు ఉంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు అదృష్టం కూడా వరిస్తుందట.

కెరీర్‌లో పురోగతి: వృత్తి, వ్యాపారంలో పురోగతిని పొందడానికి దసరా చాలా పవిత్రమైనది. సుందరకాండ పఠించడం వల్ల చాలా మంచి జరుగుతుంది.. ఇలా చేస్తే జీవితంలో వచ్చే ప్రతి చెడును నివారించవచ్చు. అభివృద్ధి పురోగతిలో ఉన్న అడ్డంకులు తొలగి జీవితంలో సంతోషం సిద్దిస్తుంది.

సంపద, శ్రేయస్సు కోసం చిట్కాలు
దసరా రోజు పాల పిట్ట దర్శనం చేసుకోవాలి. దసరా రోజున ఈ పక్షిని చూస్తే ఐశ్వర్యం కలుగుతుంది. జీవితంలో ఆనందం కలుగుతుంది.

పేదరికాన్ని తొలగించే మార్గాలు
దసరా రోజున చీపురు దానం చేయాలి.ఈ సాయంత్రం లక్ష్మీ దేవిని పూజించాలి. సమీపంలోని ఆలయానికి చీపురు దానం చేస్తే మరింత మంచి చేకూరుతుంది. అంతే కాకుండా అపరాజిత పువ్వు అంటే శంఖం పువ్వుతో ఆ అమ్మవారిని పూజించాలి. ఇలా చేయడం వల్ల మనిషి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది.

విజయం సాధించడానికి మార్గాలు: ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదంటే దసరా రోజున పీచుతో ఉన్న కొబ్బరిని పసుపు గుడ్డలో చుట్టండి. పవిత్రమైన దారం, స్వీట్లతో పాటు రామాలయంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల ప్రగతి దారులు తెరుచుకుంటాయి అని చెబుతున్నారు పండితులు.

Disclaimer :  ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..