Flowers and leaves: ఈ మొక్కల పువ్వులు, ఆకులతో సర్వరోగాలు నివారణ

మన కళ్లకి రోజూ ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తాయి. కాకపోతే వీటిని మనం పిచ్చి మొక్కలు అనుకుంటాం. ఇలాంటి కొన్ని మొక్కలను ఔషధాలకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆయుర్వేద మందులకు కూడా ఉపయోగిస్తారు

Written By: Kusuma Aggunna, Updated On : October 8, 2024 3:43 pm

Flowers-and-leaves

Follow us on

Flowers and leaves: మన కళ్లకి రోజూ ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తాయి. కాకపోతే వీటిని మనం పిచ్చి మొక్కలు అనుకుంటాం. ఇలాంటి కొన్ని మొక్కలను ఔషధాలకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆయుర్వేద మందులకు కూడా ఉపయోగిస్తారు. అలాంటి వాటిలో మదార్ మొక్క ఒకటి. ఈ మొక్కలను కొన్ని ప్రదేశాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. కొన్ని ప్రదేశాల్లో ఆకువా లేదా ఆక్ అని అంటారు. ఈ మొక్కలో ఎన్నో రకాల ఆరోగ్య పోషకాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కల పువ్వులు మాత్రమే కాకుండా.. ఆకులు, కాండం, వేర్లతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని ఔషధాలు పోషకాలు అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడటంతో పాటు ఉన్న వ్యాధులను కూడా నయం చేస్తే సత్తా ఈ మదార్ మొక్కకు ఉంది. మరి మదార్ ఆకులు, పువ్వులు, కాండంతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

మదర్ ఆకులు, పువ్వులు, కాండాల్లో వ్యాధులను నయం చేసే గుణాలు ఉన్నాయి. వీటిని ఔషధ ప్రయోజనాల కోసం విరివిగా వాడుతుంటారు. ఇందులోని లక్షణాలు చర్మ వ్యాధులు రాకుండా చేయడంతో పాటు ఎలాంటి గాయాలను అయిన నయం చేయడంలో సహాయపడతాయి. అలాగే జ్వరం, జీర్ణ సమస్యలు, శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కొందరికి దగ్గు, జలుబు ఎక్కువగా ఉంటుంది. ఎన్ని మందులు వాడినా, ఎక్కువ రోజులు అయిన కూడా తగ్గదు. అలాంటి వారికి ఆ మదార్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టం. ఈ పువ్వులతో పూజ చేస్తే శివుడు కోరిన కోర్కెలు నెరవేరుస్తాడని ప్రజలు నమ్ముతారు. ఈ పువ్వులను ఎలాగైనా శివాలయానికి తీసుకువెళ్తారు. ముఖ్యంగా శివరాత్రి వంటి సందర్భాల్లో ఎక్కువగా తీసుకువెళ్తారు. ఇది ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తుంది. పట్టణాల్లో కాస్త తక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ పువ్వుల గురించి పెద్దగా ఎవరికి తెలియదు. చాలా మంది దీనిని ఓ పిచ్చి మొక్క అని అనుకుంటారు. కానీ ఇందులో బోలెడన్నీ పోషకాలు ఉన్నాయి. ఈ మదార్ మొక్కను ఔషధాల గని అని కూడా అంటారు. ఈ మొక్కలోని దేనితో అయిన కూడా వ్యాధులు రాకుండా కాపాడవచ్చు. కొందరు చర్మ వ్యాధులు, దురద వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఈ మదార్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడతాయి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.