https://oktelugu.com/

Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తున్నాయా? కారణం ఇదే..

గుడ్లగూబ గురించి ఇప్పటి వారికి ఎక్కువగా తెలియకపోవచ్చు. ఒకప్పుడు ఊళ్లల్లో పెద్ద చెట్టుపై రాత్రి సమయంలో భయంకరంగా అరుస్తూ ఉండేది. గుడ్లగూబ అరుపుకు పిల్లలు భయపడిపోయేవారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 30, 2023 / 11:30 AM IST

    Dreams

    Follow us on

    Dreams: రాత్రి నిద్రపోయేటప్పుడు రకరకాల కలలు వస్తుంటాయి. కొందరికి పీడ కలలు వచ్చి మనసును పాడు చేస్తాయి. మరికొందరికి అందమైన కల రావడంతో ఉల్లాసంగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలలో కొన్ని వస్తువులు కనిపిస్తే మంచిదని కొందరు పండితులు చెప్పారు. అయితే కొన్ని జంతువులు కనిపించడం వల్ల వారి జీవితంలో ఏదో జరుగుతుందని అర్థం అని అంటున్నారు. కలలో ఎన్నో రకాల జంతువులు కనిపిస్తాయి. కానీ కొంతమంది ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ తరువాత వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. కొన్ని ప్రత్యేక జంతువులు కనిపిండం తోనే ఇలా ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఏ జంతువు కనిపిస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.

    గుడ్లగూబ గురించి ఇప్పటి వారికి ఎక్కువగా తెలియకపోవచ్చు. ఒకప్పుడు ఊళ్లల్లో పెద్ద చెట్టుపై రాత్రి సమయంలో భయంకరంగా అరుస్తూ ఉండేది. గుడ్లగూబ అరుపుకు పిల్లలు భయపడిపోయేవారు. గుడ్లగూబ చూడ్డానికి కూడా భయంకరంగా ఉంటుంది. కానీ ఇది కలలో కనిపిస్తే చాలా మంచిదట. ఒకవేళ కలలో గుడ్లగూబ కనిపిస్తే ఆ వ్యక్తి జీవితంలో సంపద పెరుగుతుందని అంటున్నారు.

    హిందువులు ఆవును దేవతగా కొలుస్తారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో అలంకరణ చేసి మరీ పూజలు నిర్వహిస్తారు. సకల దేవతలంతా ఆవులో ఉంటారని అంటారు. అలాంటి ఆవు కలలో కనిపిస్తే ఎంతో మంచిదని అంటున్నారు. ఆవు కనిపించిన కొన్ని రోజుల్లో ఆ వ్యక్తి జీవితం మారిపోతుంది. అప్పటి నుంచి ఆ వ్యక్తి నిత్యం ఆనందంగా ఉంటారని అంటున్నారు.

    జనాలు ఉండే చోట ఎక్కువగా ఏనుగులు కనిపించవు. జూ పార్కుల్లో, దేవాలయాల్లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. అయితే ఏనుగును సైతం ప్రత్యేకంగా పూజిస్తాం. కలలో ఏనుగు కనిపించడం వల్ల అప్పటి నుంచి కష్టాలు తొలగిపోతాయని అర్థం. త్వరలోని ఆ వ్యక్తి జీవితం ఆనందంగా ఉంటుందని తెలపడానికే ఏనుగు కనిపిస్తుందని అర్థం.

    కలలో పాము కనిపిస్తే భయపడిపోతారు. రియల్ గానే తమ వెంట పాము వస్తుందా? అనేంత భయం ఉంటుంది. ఇక నల్ల పామును చూస్తే మరీ భయంగా ఉంటుంది. అయితే నల్లపాము కలలో కనిపించడం వల్ల ఎంతో మంచిదని అంటున్నారు. భవిష్యత్ లో వీరికి అంతా మంచే జరుగుతుందని అర్థం.

    సింహం సాధారణంగా గోధుమ రంగులో ఉంటుంది. అయితే తెలుపు రంగులో ఉన్న సింహం కలలో కనిపించడం వల్ల శుభాలు కలుగుతాయని అర్థం. అప్పటి నుంచి ఆ వ్యక్తి జీవితం మారిపోతుందని పండితులు చెబుతున్నారు.