APAAR Card: ఆధార్ కార్డు గురించి తెలుసు.. మరి APAAR కార్డు ఏంటి? ఎవరు తీసుకోవాలి? ఏంటి ఉపయోగం?

ఇండియాలో ఉండే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు (Automated Peremenent Academic Account Registry) APAAR కార్డు కూడా ముఖ్యమే. అయితే దీనిని అందరూ కాకుండా విద్యార్థులు మాత్రమే తీసుకోవాలి.

Written By: Chai Muchhata, Updated On : November 30, 2023 11:28 am

APAAR Card

Follow us on

APAAR Card: ప్రతీ వ్యక్తికి ఓ గుర్తింపు ఉంటుంది. అయితే దానిని తెలియజేయడానికి, వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఆధారం ఉండాలి. అలాంటి ఆధారం నెంబర్ రూపంలో ఉండడానికి భారత్ లో ఆధార్ కార్డును ప్రవేశపెట్టారు. ఆధార్ కార్డు ద్వారా ఒక వ్యక్తి వివరాలు తెలిసిపోతుంది. అంతేకాకుండా ఏదైనా ఆర్థిక, సామాజిక వ్యవహారం జరిపించాలన్నా ఆధార్ కార్డుతో సంబంధం ఉంటుంది. భారత్ లో ఆధార్ కార్డు ఉంటేనే ఏ పనైనా పూర్తవుతుంది. అయితే ఇప్పుడు APAAR కార్డును కూడా కలిగి ఉండాలంటున్నారు. ఈ కార్డు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ APAAR కార్డు అంటే ఏమిటి? దీనిని ఎవరు తీసుకోవాలి? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇండియాలో ఉండే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు (Automated Peremenent Academic Account Registry) APAAR కార్డు కూడా ముఖ్యమే. అయితే దీనిని అందరూ కాకుండా విద్యార్థులు మాత్రమే తీసుకోవాలి. ప్రభుత్వం, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. APAAR కార్డు ద్వారా విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. కేజీ నుంచి పీజీ వరకు ఆ విద్యార్థికి సంబంధించిన వివరాలు ఈ కార్డులో ఉంటాయి. APAAR కార్డులోనూ 12 నెంబర్లు ఉంటాయి. ఈ నెంబర్ల ఆన్ లైన్లో టైప్ చేస్తే వివరాలన్ని కనిపిస్తాయి. అలాగే ఈ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ పై స్కాన్ చేసినా తెలిసిపోతుంది.

ఉదాహరణకు ఒక విద్యార్థికి స్కూల్ నుంచి పీజీ వరకు ఎక్కడెక్కడా చదివారు? ఎన్ని స్కూళ్లు మారారు? ఏ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? విద్యార్థికి సంబంధించిన కండక్ట్ తెలిసిపోతుంది. కేవలం చదువు గురించి మాత్రమే కాకుండా విద్యార్థి సాధించిన అవార్డులు, రివార్డులతో పాటు స్పోర్ట్స్ యాక్టివిటీస్ వంటి వివరాలు ఇందులో నమోదు చేస్తారు. పెరిగి పెద్దయ్యాక ఏదైనా ఇంటర్వ్యూకు వెళితే ఈ APAAR కార్డు ను చూపిస్తే చాలు.. ఆ వివరాలన్నీ వారికి తెలిసిపోతాయి.

మరి ఈ APAAR కార్డును ఎలా నమోదు చేసుకోవాలి? అనే విషయానికి వస్తే.. గూగుల్ లోకి వెళ్లి Academic Bank Of Credits అని టైప్ చేయాలి. ఇందులో Student అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తరువాత ఎవరైతే వివరాలు ఇవ్వదలుచుకున్నారో వారు Sign up కావాల్సి ఉంటుంది. దీంతో APAAR కార్డు ఎనరోల్ అవుతుంది. ఆ తరువాత కొన్ని రోజులకు కార్డు వస్తుంది. భవిష్యత్ లో ఈ కార్డు వల్ల ఎంతో ఉపయోగం ఉండనుంది.