Spirits: మనుషులకు అర్థం కానివి రెండే విషయాలు ఒకటి పుట్టుక రెండోది చావు. అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. దీంతో మనిషి ఎన్ని ప్రయోగాలు చేసినా అంతుచిక్కని రహస్యం ఇదే. ఈ లోకంలో ఇద్దరే మంచి వారట ఒకరు చనిపోయిన వారు రెండోది ఇంకా పుట్టని వారు. దీంతో మనిషి చనిపోయిన తరువాత ఏమవుతాడనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. కానీ మనిషి మరణించిన తరువాత ఆత్మ ఉంటుందని పలువురు చెబుతున్నా ఇందులో వాస్తవమెంతో తెలియడం లేదు.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ పట్టణం సమీపంలోని పాట్నా జిల్లాలో మైహర్ దేవాలయం ఉంది. ఇక్కడ శారద అమ్మవారు కొలువై ఉంటుంది. త్రికూట్ అనే కొండల మద్య ఉండటంతో నిత్యం వేలాది మంది దర్శిస్తుంటారు. కానీ ఇక్కడ రెండు ఆత్మలు అమ్మవారిని కొలుస్తాయని ప్రతీతి. ప్రతి రోజు రాత్రి సమయంలో రెండు ఆత్మలు వచ్చి పూజలు చేసి వెళ్తాయని భక్తుల విశ్వాసం.
Also Read: జాతీయ రాజకీయాలపై ‘కేసీఆర్’ అసలు ప్లాన్ ఇదే!
దీంతో రాత్రి సమయంలో ఇక్కడ ఎవరు ఉండరు. నిర్మానుష్యంగా ఉంటుంది. ఎవరైనా సాహసం చేసి ఉంటే వారు ఇక ఉండరని నమ్ముతారు. దీంతో ఈ ఆలయం విశిష్టత గురించి తెలుసుకుని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. దీంతో ఈ ఆలయం ప్రత్యేకతకు అందరు తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తుంటారు.

అలహ, ఉదమ్ అనే ఇద్దరు అన్నదమ్ముల ఆత్మలు తిరుగుతాయని చెబుతారు. రాత్రంతా వారి ఆత్మలు ఇక్కడ సంచరిస్తాయని నమ్ముతారు. ఈ ఆత్మలతో ఓ రాజు కూడా పూర్వం యుద్ధం చేశాడని చెబుతారు. దీంతో మైహర్ ఆలయాన్ని ఆత్మలే కనుగొన్నాయని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రిళ్లు ఆలయాన్ని మూసివేస్తారని చెబుతారు. రాత్రి సమయంలో ఆ ఇద్దరు ఆత్మలు దేవతను కొలుస్తారని బలంగా నమ్ముతున్నారు. అందుకే అక్కడ రాత్రిళ్లు పురుగు కూడా ఉండదని తెలుస్తోంది.
Also Read: శివరాత్రి పండుగను రాత్రివేళలో జరుపుకోవడానికి కారణమేంటో మీకు తెలుసా?