Sarkaru Vaari Paata New Poster: సూపర్ స్టార్ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు గుడ్‌న్యూస్. కీర్తి సురేశ్‌తో కలిసి మహేశ్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ నుంచి ఈ రోజు ఓ అప్‌డేట్ రానుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఉదయం 11.07 గంటలకు స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
Sarkaru Vaari Paata New Poster
ఇటీవల కళావతి పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాట యూట్యూబ్ లో 50 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను క్రాస్ చేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది. అలాగే 1.3 మిలియన్స్‌కు పైగా లైక్స్ సాధించింది. కాగా తాజాగా జరుగుతున్న షెడ్యూల్ లో మహేష్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.
Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి బిగ్ అప్ డేట్
మార్చి చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా ఈ సినిమాలో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ మధ్య సాగే ట్రాక్ కూడా చాలా ఎంటర్ టైన్ గా ఉంటుందట. మొత్తానికి ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.
కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. అన్నట్టు మహేష్ ఈ సినిమాని త్వరగా పూర్తి చేసి త్రివిక్రమ్ సినిమా పై పని చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు.
Also Read: Mahesh Babu Kalavathi Song: ‘కళావతి’తో యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న మహేష్ !
Recommended Video: