https://oktelugu.com/

Drinking Water: ఇవి తిన్నవెంటనే నీరు అస్సలు తాగొద్దు

నేటి కాలంలో రుచికరమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే కాలంతో సంబంధం లేకుండా అన్నిరకాల పండ్లు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కానీ చాలా మంది ఆహార పద్ధతులు పాటించడంలో నిర్లక్ష్యం చేయడంలో అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 2, 2024 / 05:13 PM IST

    Drinking Water

    Follow us on

    Drinking Water: మానవ శరీరంలో నీటిశాతం 60 శాతం వరకు ఉంటుంది. ఒక్కరోజూ నీరు తాగకుండా ఉండలేము. నీటిని ఎక్కువగా తీసుకోవడంతోనే ఆరోగ్యంగా ఉంటారు. వేసవికాలంలో నీరు ఎక్కువగా తీసుకోకపోతే డీ హైడ్రేషన్ కు గురై అనేక సమస్యలు వస్తుంటాయి. అలాగే ఆహారం తిన్న తరువాత సరైన విధంగా నీరు తీసుకోకపోతే జీర్ణం కాక డైజేషన్ సమస్యలు వస్తాయి. అయితే కొన్ని పదార్థాలు తిన్న తరువాత నీటిని అస్సలు తీసుకోకూడదు. ఇవి తిన్న తరువాత నీరు తాగితే అనేక రోగాల బారినపడుతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏ పదార్థాలు తిన్న తరువాత నీటిని తీసుకోకూడదు? ఆ వివరాల్లోకి వెళితే..

    నేటి కాలంలో రుచికరమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే కాలంతో సంబంధం లేకుండా అన్నిరకాల పండ్లు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కానీ చాలా మంది ఆహార పద్ధతులు పాటించడంలో నిర్లక్ష్యం చేయడంలో అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. రోజూవారీ ఆహారంలో భాగంగా కొన్ని పండ్లు తిన్న తరువాత మిగతా ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఆ విషయంపై అవగాహన లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అరటిపండు తిన్న తరువాత నీటిని అస్సలు తీసుకోకూడదు. ఇది తిన్న తరువాత నీరు తాగితే కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    పెరుగుతో భోజనం చేస్తేనే కొంతమందికి పరిపూర్ణం అవుతుంది. పెరుగు తినడం వల్ల ఎంతో ఆరోగ్యం. కానీ పెరుగుతో కలిపిన పదార్థాలు తిన్న తరువాత వెంటనే నీటిని తీసుకోకూడదు. కనీసం అరగంట గడిచిన తరువాత నీరు తాగాలి. నారింజ, ద్రాక్ష పండ్లలో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని వీలైనప్పుడల్లా తీసుకోవడం మంచిదని అంటారు. కానీ ఇవి తిన్న తరువాత నీటిని తీసుకుంటే డైజేషన్ సమస్యలు వస్తాయి.

    మసాలా ఫుడ్ అంటే కొందరు లొట్టలేస్తారు. ఇవి ఎంతో రుచికరంగా ఉన్నా.. తరుచుగా తింటే అల్సర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మసాలా ఫుడ్ తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల కడుపులో మంట అనిపిస్తుంది. అయితే నీటికి బదులు పెరుగు తీసుకోవడం వల్ల కాస్త ఊరట కలుగుతుంది. అన్నం తినేటప్పుడు ఎక్కువగా నీరు తాగుతారు. ఇలా తాగడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కాకుండా నీటిలో తేలియాడినట్లవుతుంది. దీంతో డైజేషన్ కాకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి.