Hibiscus Plant Vastu: ఇంట్లో మందారా మొక్క ఉంచాలా? ఉంటే మంచిదా?

మందారం పువ్వుల ఎర్రటి రంగుల్ల ఉంటాయి. మందారం పూలతో పూజలు చేయడం వల్ల ఎన్నో ఫలితాలు ఇస్తాయి. ఆంజనేయ స్వామికి మందారం పూలతో పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి.

Written By: Srinivas, Updated On : January 2, 2024 5:16 pm

Hibiscus Plant Vastu

Follow us on

Hibiscus Plant Vastu: ఈ భూమిపై మనుషులతో పాటు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని బయోలజీ శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇవి కార్బన్ డైయాక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయని చిన్నప్పటి నుంచే చదువుకుంటూ ఉంటాం. ఈ నేపథ్యంలో ప్రతి ఇంట్లో ఓ చెట్టును పెంచాలని ప్రభుత్వాలు సైతం ప్రచారం చేస్తాయి. అయితే కొన్ని చెట్లు పెంచడం వల్ల మంచి గాలిని ఇవ్వడమే కాకుండా ఇంట్లో ఉన్న దోషాలను కూడా తొలగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మందారం చెట్టు ఉండడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కొందరు పండితులు చెబుతున్నారు. ప్రధానంగా కుజుడు దోషం ఉన్న వారు ఈ చెట్టు పెంచితే పరిస్కారం అవుతుందని అంటున్నారు. మందారం చెట్టు ఇంట్లో ఉండడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..

మందారం పువ్వుల ఎర్రటి రంగుల్ల ఉంటాయి. మందారం పూలతో పూజలు చేయడం వల్ల ఎన్నో ఫలితాలు ఇస్తాయి. ఆంజనేయ స్వామికి మందారం పూలతో పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. అలాగే మహాలక్ష్మీ దేవతకు కూడా మందారం పూలంటే చాలా ఇష్టం. ఈ పూలు ఉంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నవారు మందారం చెట్టును పెంచుకోవడం వల్ల ఉపశమనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతీ శుక్రవారం మహాలక్ష్మీ అమ్మవారి పటం వద్ద మందార పువ్వును ఉంచడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి.

జాతకంలో సూర్య దోషాలు ఉన్నవారు మందారం పువ్వులతో పూజ చేయాలి. ఇంటికి తూర్పు దిశలో మందారం చెట్టును పెంచడం వల్ల ఎలాంటి దోషాలు ఉన్నా తొలిగిపోతాయని అంటున్నారు. అయితే కొన్ని ఇళ్లల్లో చెట్లను పెంచుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి సందర్భంలో ఒక కుండీలో మందారం చెట్టును పెంచుకున్నా అనుకూల ఫలితాలు ఉంటాయి. కుజ దోషం వల్ల కొందరికి వివాహాలు జరగవు. ఇలాంటి వారు మందారం పూలతో పూజ చేయడం వల్ల శుభఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.