
Nutmeg : మనం కూరల్లో వేసుకునే దినుసుల్లో జాజికాయ ఒకటి. మాంసాహార వంటకాల్లో మసాలాల్లో దీన్ని వాడుతుంటాం. మన ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో జాజికాయను వేసుకుని తింటుంటాం. శరీరంలో వైరస్ లు ప్రవేశించినప్పుడు మనకు రక్షణ కణాలను ఉత్పత్తి చేయడంలో కూడా సాయపడుతుంది. జాజికాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో జాజికాయకు మంచి ప్రాధాన్యం ఉంది. దీంతో ఎన్నో రకాల రోగాలు నయమవుతాయి. ఈ నేపథ్యంలో జాజికాయ వాడకం మనకు ప్రయోజనాలు కలిగిస్తుంది.
జాజికాయ మనకు పలు రకాల లాభాలు ఉన్నాయి. శరీరంలో విడుదలయ్యే రసాయనాలను విచ్ఛిన్నం చేసి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది జాజికాయ పొడిని వేడి నీటిలో వేసి కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జాజికాయను రోజుకు 15 లేదా 16 గ్రాముల కంటే ఎక్కువగా వాడుకోవచ్చు. ఈ మోతాదును మించితే నష్టం ఉంటుంది. జాజికాయను నీటితో అరగదీయాలి. దీంతో మనకు ప్రయోజనాలు మెండుగా ఉంటాయి.

జాజికాయ మిశ్రమాన్ని నోటిలో ఉండే పుండ్లపై రాయడం ద్వారా పుండ్లు త్వరగా మానేందుకు అవకాశం ఉంటుంది. ఈ మిశ్రమంతో దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలు మెరుస్తాయి. దీంతో పళ్లు పుచ్చిపోకుండా ఉంటాయి. చిగుళ్ల సమస్యలు రావు. జాజికాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. బ్యాక్టీరియాలను నశింపచేసే నోటి ఆరోగ్యాన్ని దూరం చేయడంలో ఇవి సాయపడతాయి. జాజికాయ అరగదీయగా వచ్చిన మిశ్రమాన్ని తేనెను కలిపి చర్మంపై ఉండే బ్లాక్ హెడ్స్ పై లేపనంగా రాయాలి. తరువాత మీగడతో రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.
మానసిక ఒత్తిడి, ఆందోళన, మూడ్ స్వింగ్స్ వంటివి తగ్గించడంలో జాజికాయ తోడ్పడుతుంది. రాత్రి పడుకునే ముందు పాలల్లో జాజికాయ పొడి, బాదం పొడి, యాలకుల పొడి వేసి కలిపి తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది. పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. జాజికాయను రోజు 5 గ్రాముల మోతాదులో ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వంటల్లో వాడుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.