
Balagam Collection: ఓటీటీ కాలం లో ఒక సినిమాకి నెల రోజులకు పైగా షేర్ వసూళ్లు రావడం ఈమధ్య కాలం లో చాలా అరుదుగా జరిగింది. అలాంటి సినిమాల జాబితాలో ‘బలగం’ చిత్రం కూడా చేరిపోయింది. చిన్న సినిమా గా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు, కేవలం 50 లక్షల రూపాయిల గ్రాస్ ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ చిత్ర బాక్స్ ఆఫీస్ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.
విజయవంతంగా నెల రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా, ఈ సినిమా వసూళ్ల జోరు ఇంకా తగ్గలేదు.విశేషం ఏమిటంటే ఓటీటీలో విడుదల చేసిన తర్వాత కూడా ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు తగ్గలేదు. కొత్తగా న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపేస్తుంది, మరోపక్క IPL సీజన్ కూడా ప్రారంభం అయ్యింది, కానీ ‘బలగం’ జోరు మాత్రం తగ్గలేదు.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమా 30 వ రోజు కూడా 30 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందట.అలా ఈ 30 రోజులకు గాను ఈ సినిమా 26 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, మరియు 13 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది తెలుస్తుంది.ఈ గ్రాస్ వసూళ్లు మొత్తం 90 శాతం తెలంగాణ ప్రాంతం నుండే రావడం విశేషం.

అంటే కాదు తెలంగాణ లో ఈ సినిమా విడుదలైన ప్రతీ కేంద్రం లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుందని సమాచారం.ఇదే ట్రెండ్ కొనసాగితే 50 రోజుల వరకు కూడా గ్రాస్ మరియు షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.#RRR వంటి చిత్రానికి కూడా కేవలం నెల రోజులు మాత్రమే షేర్ వసూళ్లు వచ్చాయి, కానీ ‘బలగం’ చిత్రానికి 50 రోజుల వరకు ఈ మాస్ జాతర కొనసాగేలానే ఉంది.