Daridra Devatha: మనం జీవితంలో ఎన్నో తప్పులు చేస్తుంటాం. అవి చిన్నవే కదా అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ అవే మన పాలిట శాపంగా మారతాయి. మన ఇంట్లో దారిద్ర్యం తిష్టవేసుకోవడానికి కారణమవుతాయి. మనం చేసే తప్పులే మనకు ప్రతిబంధకాలుగా రూపం దాల్చుతాయి. ఏ పని చేయాలో ఏది చేయకూడదో తెలుసుకుని మసలుకుంటే మంచిది. తెలిసీ తెలియని పనులు చేస్తూ పొరపాటున సమస్యల్లో పడిపోతున్నాం. హిందూ సంప్రదాయంలో మన ఇంటికి వాస్తు పద్ధతులు చూసుకోవడం అలవాటే.

తెల్లవారిన తరువాత పొద్దుపోయే వరకు నిద్రించకూడదు. అలా చేస్తే మనకు అరిష్టమే. సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లాలి. ముగ్గుపెట్టుకోవాలి. సూర్యుడి వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుందట. ఇంకా సూర్యుడు వచ్చే వరకు కూడా నిద్ర పోవడం అంత మంచిది. ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి. పొద్దు పొడిచే వరకు స్నానాదులు పూర్తి చేసుకోవాలి. ఇలాంటి చిన్ని చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుంది. లేకపోతే ఇబ్బందులే ఎదురవుతాయి.
నిద్ర లేచిన తరువాత దుప్పటి తీసి చక్కగా మడత పెట్టి తరువాత బయటకు రావాలి. దుప్పటి మంచం మీద పడేయకూడదు. దుప్పటి మడత పెట్టకపోతే దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుందట. అందుకే మంచం మీద దుప్పటి మడతపెట్టాల్సిందే. భోజనం చేసిన తరువాత అలాగే కూర్చోకూడదు. ఎంగిలి పళ్లెం అలాగే ఉంచకూడదు. తొందరగా దాన్ని శుభ్రం చేసుకుని తీరాలి. తిన్న తరువాత చేయి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్ర దేవత కూడా మనతోపాటే కూర్చుంటుందట. ఇంట్లో వాళ్లు అనారోగ్యాలపాలవుతారని నమ్ముతారు.

మాసిన బట్టలు ఉతికిన తరువాత స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ల మీద పోసుకోకూడదు. దరిద్రం పడుతుంది. వంట గదిలో పాత్రలు పెట్టుకోవడానికి ఉపయోగించే మసిగుడ్డలను పొద్దుపోయిన తరువాత ఉతకకూడదు. చీపురును నిలబెట్టకూడదు సాయంత్రం పూట ఎప్సుడు కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం కలవకూడదు. ఎవరితో గొడవపడకూడదు. సాయంత్రం ప్రదోశ కాలంలో ధ్యానం, పూజ మంచి ఫలితాలు ఇస్తాయి. సాయంత్రం ఆరు తరువాత ఇంటికి ఉప్పు, సూది, కోడిగుడ్లు, నూనె వంటివి తీసుకురాకూడదు.
ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని వెంటబెట్టుకున్నట్లే. దుమ్ము, ధూళి, చెత్తచెదారం జమచేయకూడదు. తాళిబొట్టు, గాజులు రాత్రి పూట పక్కన పెట్టకూడదు. మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు, పిన్నులు వంటివి తగిలించకూడదు. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తెలియక చేసే పనులతో ఇంట్లో దరిద్రాలు చేరతాయి. అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లో ఎలాంటి ప్రతికూలతలు రాకుండా చేసుకోవడానికి వాస్తు పద్ధతులు కచ్చితంగా పాటించి మనకు ఉపద్రవాలు రాకుండా చేసుకోవాలి.