Khushi Re Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి కొలమానం అంటూ ఏమి ఉండదు..ఆయన సినిమా వచ్చిందట చాలు టాక్ తో సంబంధం లేకుండా కాసుల కనకవర్షం కురుస్తుంది..ఇదివరకు కేవలం ఆయన కొత్త సినిమా విడుదల ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసేవాళ్ళు అభిమానులు..కానీ ఇప్పుడు ఆయన పాత సినిమాల కోసం కూడా ఎదురు చూడడం ప్రారంభించారు..ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ జల్సా సినిమా స్పెషల్ షోస్ ని ప్రపంచవ్యాప్తంగా వేసుకున్నారు..రెస్పాన్స్ అదిరిపోయింది.

కేవలం ఒక్క రోజులోనే ఈ సినిమాకి దాదాపుగా మూడు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇది ఆల్ టైం ఇండియన్ రికార్డు..ఈ రికార్డు ని ఇప్పటి వరకు ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయారు..కానీ ఇప్పుడు ఈ అనితరసాధ్యమైన రికార్డు ని మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్రేక్ చెయ్యబోతున్నారు..ఈ నెల 31 వ తారీఖున పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ప్రారంభమైంది..అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ స్టార్ హీరో కొత్త సినిమా రేంజ్ లో ఉంది..బుకింగ్స్ తెరిచిన నిమిషాల వ్యవధి లోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగ సేల్ అయిపోతున్నాయి..ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎవ్వరు ఊహించని రేంజ్ లో ఉన్నాయి..అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం హైదరాబాద్ సిటీ నుండి ఈ చిత్రానికి 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

రేపటి నుండి మరికొన్ని షోస్ కూడా యాడ్ అవ్వబోతున్నందున అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ రెండు కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం..అదే కనుక జరిగితే కేవలం నైజం ప్రాంతం వసూళ్లతో జల్సా స్పెషల్ షోస్ వరల్డ్ వైడ్ గ్రాస్ నెంబర్ రికార్డుని బద్దలు కొడుతుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..చూడాలిమరి ఖుషి రీ రిలీజ్ ఏ రేంజ్ ప్రభంజనం సృష్టించబోతుందో అనేది.