Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె పెట్ డాగ్ బ్లోసమ్ కన్నుమూసింది. ఈ విషయాన్ని రకుల్ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. బ్లోసమ్ తో రకుల్ కి 16 ఏళ్ల అనుబంధం ఉందట. మా తో పాటు కలిసి పెరిగావు. నీవు లేవన్న బాధ జీర్ణించుకోవడం కష్టం. నిన్ను బాగా మిస్ అవుతానని, దూరమైన పెట్ డాగ్ ని ఉద్దేశిస్తూ రకుల్ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. బ్లోసమ్ తో దిగిన ఫోటోలు కూడా రకుల్ అభిమానులతో పంచుకున్నారు. రకుల్ తన ప్రియమైన పెట్ డాగ్ ని కోల్పోయారని తెలిసిన ఫ్యాన్స్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.

పెట్ డాగ్స్ కల్చర్ ఇండియాలో విపరీతంగా పెరిగిపోతుంది. మారుతున్న జీవన విధానంతో పెట్ యానిమల్స్ ప్రాధాన్యత పెరుగుతుంది. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై తన పెట్ డాగ్ మరణించడంతో ఇంట్లో మనిషి పోయినంతగా ఏడ్చారు. ఇటీవల చార్లీ 777 టైటిల్ తో పెట్ డాంగ్ నేపథ్యంలో రక్షిత్ శెట్టి హీరోగా ఓ మూవీ విడుదలై విజయం సాధించింది. రకుల్ సైతం బ్లోసమ్ మరణాన్ని జీర్ణించుకోలేకుంది. దాన్ని చాలా మిస్ అవుతాను, తన జ్ఞాపకాలు వేదిస్తాయని రకుల్ వేదన చెందుతున్నారు.
మరోవైపు రకుల్ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. 2023లో రకుల్ ప్రియుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకోవడం ఖాయం అంటున్నారు. గతంలో రకుల్ తమ్ముడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రకుల్-జాకీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. అయితే ఇద్దరూ తమ తమ ప్రొఫెషన్స్ లో బిజీగా ఉన్నారు. అందుకే ఆలస్యం అవుతుంది. వచ్చే ఏడాది రకుల్ పెళ్లి జరగవచ్చు అని మీడియాతో వెల్లడించారు. రకుల్ మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. జీవితంలో పెళ్లి కంటే ముఖ్యమైన విషయాలు అనేకం ఉంటాయి. పెళ్లి కుదిరినప్పుడు కచ్చితంగా చెప్తాను, పదే పదే అడగకండి, అంటూ మీడియాపై మండి పడింది.

ఇక రకుల్ కెరీర్ పరిశీలిస్తే 2022 ఆమెకు అసలు కలిసి రాలేదు. బాలీవుడ్ లో ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. అటాక్, రన్ వే 34, కట్ పుట్లీ, డాక్టర్ జి, థాంక్ గాడ్… ఇలా ఐదు సినిమాలు రకుల్ హీరోయిన్ గా విడుదలయ్యాయి. ఒక్కటంటే ఒక్కటి హిట్ టాక్ తెచ్చుకోలేదు. తెలుగులో ఆమెకు పూర్తిగా దారులు మూసుకుపోయాయి. ప్రస్తుతం రెండు హిందీ, రెండు తమిళ చిత్రాల్లో రకుల్ నటిస్తున్నారు. ఆమె ఖాతాలో భారతీయుడు 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్ ఉంది.