Dreams And Meanings: నిద్ర పోయాక కలలు రావడం సహజం. ఇందలో కొన్ని జీవితం, ఉద్యోగం, కుటుంబం, తల్లిదండ్రులు, విద్యకు సంబంధించినవి ఉంటాయి. కొంతమంది తమ కలలో ప్రేమ, సంబంధాలు ఇంకా వివాహం మొదలైన వాటిని చూస్తారు. ఈ కలలు ఆధారంగా సానుకూల ప్రతికూల అంశాలు ఉంటాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. కొన్ని సందర్భాల్లో శుభసూచకమైన కలలు వస్తాయి. కొన్ని కలలు భయంకరమైన సంఘటనకు సంకేతంగా భావించాలి. మనం జీవిత భాగస్వామి, మాజీ ప్రియురాలు, అపరిచిత వ్యక్తులతో శారీరకంగా కలిసినట్లు కలవస్తే దాని అర్ధమేంటి.. దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
కలల అర్థాలు ఇవీ..
స్వప్న శాస్త్రం ప్రకారం.. కొన్ని కలలు ఒక వ్యక్తిని భవిష్యత్తుతో కలుపుతాయి. దాని అర్థం తెలుసుకోవడం కూడా అవసరం. కలలో మాజీ ప్రియురాలు లేదా ప్రియుడితో శారీరకంగా కలిసినట్లు కల వస్తే మీరు వారిని ఇంకా మర్చిపోలేదని అర్థం. మన మెదడులో ఎక్కడో ఇంకా జ్ఞాపకాలు ఉన్నాయని భావించాలి. మాజీతో కనెక్ట్ అవ్వాలని కోరిక కూడా ఉండి ఉండొచ్చు. ఈ కల అర్థం మీ బంధాన్ని తిరిగి కొనసాగించాలని ఆశిస్తున్నారన్నమాట.
భాగస్వామితో సంతృప్తి లేదని..
ఇక మాజీ ప్రియుడు/ప్రియురాలితో శారీరకంగా కలిసినట్లు కల వస్తే.. మీరు ప్రస్తుత భాగస్వామితో సుఖంగా లేరని శాస్త్రం చెబుతోంది. ఈ సమయంలో భాగస్వామి పశ్చాత్తాపపడతారని పండితులు పేర్కొంటున్నారు. ఇది వైవాహిక జీవితానికి ఏమాత్రం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఇది భార్యా భర్తల మధ్య గొడవలకు దారితీస్తాయని స్వప్న శాస్త్రం అంటోంది.
భాగస్వామితో సంభోగం..
ఇక స్వప్న శాస్త్రం ప్రకారం.. భాగస్వామితోనే సంభోగం చేసినట్లు కల రావడం శుభ సూచకం అంటున్నారు. ఇలా కల కంటే మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుందని అర్థమట. అన్యోన్యత పెరుగుతుందంట. శృంగార సంబంధాలు కూడా పెరుగుతాయట. ఇది వైవాహిక జీవితాన్ని మెరుగు పరుస్తుందని పండితులు చెబుతున్నారు. కొత్త జంటలకు ఈ కల వస్తే త్వరలోనే ఇంటికి చిన్న అతిథి రాబోతున్నాడని సూచకమట.
అపరిచితులతో…
ఇక వివాహితులు అపరిచితులతో సంబంధాలు ఉన్నట్లు కల వస్తే.. మీరు మీ జీవితభాగస్వామి సాన్నిహిత్యం కోసం ఎదురు చూస్తున్నారని సంకేతం. మీ భాగస్వామితో సంతోషంగా లేరని, జీవితంలో ప్రేమ, శృంగారం కోసం ఎదురు చూస్తుననారని దాని అర్ధం. ఇక పెళ్లి కాని వారు అపరిచితులతో శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు కల వస్తే.. త్వరలో శుభవార్తలను అందుకుంటారని సూచన. పెళ్లి ఫిక్స్ అవుతుందని, లేదా ప్రేమలో పడే అవకాశం ఉందని సంకేతమట.