Kalki Movie: కల్కి మూవీలో నాగ్ అశ్విన్ చేసిన ప్రధాన తప్పులు ఇవే…

Kalki Movie: మహాభారతం ఆధారంగా నాగ్ అశ్విన్ ఈ కథను తీసుకున్న విషయం మనకు తెలిసిందే..కథ బాగున్నప్పటికీ కథనంలో మాత్రం నాగ్ అశ్విన్ చాలావరకు మిస్టేక్స్ అయితే చేశాడు.

Written By: Gopi, Updated On : June 27, 2024 5:14 pm

These are the main mistakes Nag Ashwin made in Kalki Movie

Follow us on

Kalki Movie: భారీ అంచనాల మధ్య ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రేక్షకుడిని మెప్పించినప్పటికి కూడా ఇందులో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం కొన్ని మిస్టేక్స్ అయితే చేశాడు. ఇక ఆ మిస్టేక్స్ ఏంటి అనేది కనక ఆయన చేసి ఉండకపోతే మాత్రం ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించేది. అసలు ఆయన చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

ఇక మహాభారతం ఆధారంగా నాగ్ అశ్విన్ ఈ కథను తీసుకున్న విషయం మనకు తెలిసిందే..కథ బాగున్నప్పటికీ కథనంలో మాత్రం నాగ్ అశ్విన్ చాలావరకు మిస్టేక్స్ అయితే చేశాడు. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం కథనం అంతా బోరింగ్ గా సాగుతుంది. అలా కాకుండా స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉన్నట్లయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మీద కూడా ప్రేక్షకుడికి విపరీతమైన అంచనాలైతే ఉండేవి. అలాగే ప్రతి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసేది. ఇక హీరో ఇంట్రడక్షన్ సినిమా స్టార్ట్ అయిన చాలా సేపటి తర్వాత ఉండడం వల్ల ప్రేక్షకుడు అప్పటిదాకా నిరుత్సాహంతోనే ఉంటాడు.

ఇక మొత్తానికైతే ప్రభాస్ వచ్చినా కూడా ఆయన సీన్స్ లో గాని ఆయనకు ఇచ్చిన క్యారెక్టర్ లో గాని దమ్ము లేకపోవడం వల్ల ఎంతసేపు ఎవరిని కొట్టి తనకు కావాల్సిన డబ్బులు సంపాదిద్దామా అని ఆలోచిస్తాడు. అంతే తప్ప అ సినిమాని ప్రేక్షకుడిని కనెక్ట్ చేయడంలో మాత్రం ప్రభాస్ పాత్ర ఫస్టాఫ్ మొత్తం డల్ అయిందనే చెప్పాలి. ఇక ప్రేక్షకుడు సెకండ్ హాఫ్ లో కొంచెం రిలాక్స్ గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే సినిమా మొత్తం సెకండ్ హాఫ్ లోనే నడిపించే ప్రయత్నం చేశాడు.

ఇక అలాగే నాగ్ అశ్విన్ ఈ సినిమాలో సంతోష్ నారాయణన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకొని చాలా పెద్ద తప్పు చేశాడు. ఎందుకంటే ఈ సినిమాలో ఒక్క సాంగ్ కూడా సరిగ్గా లేదు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయినా సరిగ్గా ఉందా అంటే అది కూడా సో సో గానే కొట్టాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ఆయన చూపించింది మాత్రం ఏమీ లేదని అది కనక నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టయితే సినిమా మరొక మెట్టు పైకి ఎక్కి ఉండేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది…