AVS: సీరియల్స్ లో చాలా ఫేమస్ అయిన వీరిద్దరూ ప్రముఖ నటుడి కూతురు, అల్లుడు అని తెలుసా?

బ్రహ్మానందం, ఏవీఎస్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ కు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. అయితే చేతినిండా సినిమాలు.. నటుడిగా వెండితెరపై సందడి చేస్తూ ఎంతో సరదాగా కనిపించిన ఏవీఎస్..2013లో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

Written By: Swathi, Updated On : June 27, 2024 5:02 pm

AVS

Follow us on

AVS: ఏవీఎస్ గుర్తున్నారా? నవ్వులు పూయించడంలో దిట్టం. కానీ ఈ లోకాన్ని వదిలి వెళ్లి అభిమానులను కంటతడి పెట్టించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈయన అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. కమెడియన్ గా మాత్రమే కాదు రచయితగా.. నిర్మాతగా, దర్శకుడిగా, పాటల రచయితగా అనేక సినిమాలకు వర్క్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఏవీఎస్.

బ్రహ్మానందం, ఏవీఎస్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ కు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. అయితే చేతినిండా సినిమాలు.. నటుడిగా వెండితెరపై సందడి చేస్తూ ఎంతో సరదాగా కనిపించిన ఏవీఎస్..2013లో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన మరణం తెలుగు సినీ ఇండస్ట్రీలోకి తీరని లోటుగా మిగిలింది. ఇక ఈయన కుటుంబ సభ్యుల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.అయితే ఈయనకు ఓ కూతురు ఉంది. కూతురు, అల్లుడు కూడా నటీనటులే. ముఖ్యంగా తెలుగు ఫ్యామిలీ అడియన్స్‏కు చాలా దగ్గరి వారే అంటే నమ్ముతారా?. కానీ వీరిద్దరు ఏవీఎస్ కుటుంబీకులని ఎవరికి తెలియదు.

ఏవీఎస్ కూతురు శ్రీ ప్రశాంతి. ఈమె ప్రస్తుతం బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఎన్నో సీరియల్స్‏లో కీలకపాత్రలు పోషించింది అమ్మడు. ప్రస్తుతం చాలా సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తుంది కూడా. అలాగే పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది ఏవీఎస్ కూతరు. అయితే ఈమెకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు.. తండ్రితో కలిసి ఉన్న జ్ఞాపకాలను ప్రేక్షకులతో పంచుకుంటూ.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

ఈమె బుల్లితెర నటుడు శ్రీనివాస్ ను వివాహం చేసుకుంది. శ్రీనివాస్ అలియాస్ యాక్టర్ చింటు తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సినిమాలు, సీరియల్లో విలన్ గా మెప్పించారు. కొన్నింటిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఇండస్ట్రీలో బిజీ గా ఉన్నారు ఈయన. అయితే ప్రశాంతి చేసిన ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ టాపిక్ మన ముందుకు వచ్చిందన్నమాట.