Destruction of human life: జీవితం బాగుండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు కొందరి జీవితం తప్పుదారి పడుతుంది. వారి తల్లిదండ్రులు, గురువులు ఎంత ప్రయత్నించినా వారు చేసేది మాత్రం చేయక మానరు. అలాంటప్పుడు తన జీవితానికి తనే కారణం అని అనుకోవాలి. అయితే ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావడానికి తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా ఒక కారణంగా నిలుస్తుంది. కానీ వాతావరణం అంతా బాగున్నా.. కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా తమ జీవితం పాడవడానికి ఇతరులను ఎత్తిచూపుతారు. అసలు ఏ పరిస్థితుల్లో ఇలా జీవితం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది?
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎన్నో నైపుణ్యాలు చెబుతూ ఉంటారు. అలాగే గురువును కూడా చక్కటి భోజనం చేస్తారు. అయినా కూడా తల్లిదండ్రులకు ఉన్న ఇద్దరు పిల్లల్లో ఎవరో ఒకరు తప్పుడు దారి పడతారు. అలా పట్టడానికి తల్లిదండ్రులు కారణమని ఎలా చెప్పగలం? ఎందుకంటే వారిలో ఒకరు బాగుపడతాడు. బాగుపడే వ్యక్తికి తనే కారణం అయినప్పుడు.. చెడిపోయిన వ్యక్తికి కూడా ఆ వ్యక్తి కారణం అయి ఉంటాడు కదా? అలాంటప్పుడు తల్లిదండ్రులు ఎలా బాధ్యులు అవుతారు? ఏ తల్లిదండ్రులు అయినా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు.. అలాగే గురువును కూడా తమ శిష్యులు సక్రమ దారిలో ఉండాలని కోరుకుంటారు.
Also Read: మహేష్ బాబు ను పక్కన పెట్టిన ఆ స్టార్ డైరెక్టర్…కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు…
కానీ కొంతమంది తమకు ఉన్న స్వార్థ గుణంతో.. తాము మాత్రమే మంచిగా బతకాలని ఆశతో అక్రమ దారులు పడుతూ ఉంటారు. ఇలా ఒకటి ప్రారంభమైన తర్వాత అదే దారిలో వెళ్తూ అనేక తప్పులు చేస్తుంటారు. అయితే ఇలా అక్రమ దారి పట్టిన తర్వాత వారు ఎంత చెప్పినా ఇతరుల మాట వినకుండా వెళ్తారు. సొంతంగా వారికి ఏదో ఒక రోజు అర్థమయ్యేసరికి తప్పులు చేస్తూనే ఉంటారు.
అంటే సొంతంగా అర్థం కావడానికి ఏ సమయమైనా పట్టవచ్చు. అంటే ఎప్పటికైనా ఒక వ్యక్తి తన గురించి తాను మాత్రమే తెలుసుకొని సక్రమమైన దారిలో వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఇతరులను నిందించడం.. ఇతరులపై ఆధారపడి జీవించడం అనేది సమంజసం కాదు. ఇతరులను నిందించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఏం కావాలో? ఎలాంటి వాతావరణం ఉండాలో? అని నిర్ణయించుకోగలుగుతాడు. అంతేకాకుండా గురువులు చెప్పిన మాటలను విని ఆ బాటలో పయనించేవారు అనుకున్న పనిని సక్సెస్ చేయగలుగుతారు.
కానీ కొందరికి తమ స్నేహితులు లేదా కొందరు వ్యక్తుల ప్రభావంతో తప్పుడు దారులు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. ఇది తాత్కాలికంగా వారికి బాగా అనిపించినా.. ఆ తర్వాత వారి జీవితానికి అనేక చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పటికైనా ఇతరుల మాట విన్నా.. వారు చెప్పిన విషయాల్లో మంచివి మాత్రమే గ్రహించే ప్రయత్నం చేయాలి. అప్పుడే తమ జీవితం బాగుంటుంది. తమతో పాటు తమ తరాల వారికి కూడా ఆదర్శంగా నిలువ గలుగుతారు.