High-value Timber: ఎర్రచందనాన్ని భూమ్మీద బంగారం లాగా పోల్చుతూ చెబుతుంటారు కదా పుష్ప సినిమాలో కేశవ. నిజానికి ఎర్రచందనం విలువైనదే. టేకు, నల్లమద్ది, సండ్ర చెట్ల కలప కంటే డిమాండ్ ఉన్నదే. ఎర్రచందనానికంటే, టేకు, మాజీయం వంటి చెట్ల కలప కంటే అత్యధికంగా డిమాండ్ ఉన్న కలప ఒకటి ఉంది. ఈ చెట్టు కలప కిలో కోటి రూపాయలు వరకు పలుకుతుంది. వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.
Also Read: 4 BHK రెంట్ 2.3 లక్షలు, అడ్వాన్స్ 23 లక్షలట.. ‘బెంగ’ళూరు అద్దెల వ్యథ…
కిలో కలప కోటి రూపాయలు పలికే ఈ చెట్టు పేరును అగర్ వుడ్.. దీనిని ఆల్ట్రా, లగ్జరీ పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తుంటారు. దీని కలప ద్వారా తయారుచేసిన ఔషధాలను ఆయుర్వేదం, యునాని వైద్యంలో ఉపయోగిస్తుంటారు. దీర్ఘకాలిక రోగాల నివారణకు ఈ చెట్టు కలప ద్వారా తయారుచేసిన ఔషధాలను వినియోగిస్తుంటారు. దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలలో దేవుళ్లకు ఆధ్యాత్మికంగా ధూపం వెలిగించడానికి దీనిని ఉపయోగిస్తుంటారు. కొన్ని సందర్భాలలో అగర్ వుడ్ గ్రామం 50 వేల వరకు కూడా అమ్ముడుపోవచ్చు. ప్రస్తుతం బంగారం కిలో ధర 90 నుంచి కోటి రూపాయల వరకు ఉంది. ఈ చెట్టు కలప కిలో కోటివరకు పలుకుతోంది. స్థూలంగా చెప్పాలంటే ఈ చెట్టు బంగారం కంటే ఎక్కువ సమానం. వజ్రాల కంటే కూడా ఎక్కువ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, జపాన్ దేశానికి చెందిన బిలియనీర్లు ఈ కలప మీద విపరీతమైన మక్కువ పెంచుకుంటున్నారు.
అగర్ వుడ్ ఎక్కడపడితే అక్కడ పెరగదు. ఈ భూమ్మీద అరదుగా ఈ వృక్షాలు ఉన్నాయి. మనదేశంలో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, భూటాన్, ఇండోనేషియా, వియత్నం అడవుల్లో ఈ చెట్ల పెరుగుతాయి. ఈ చెట్లు సహజ వాతావరణంలోనే ఉంటాయి. కృత్రిమంగా వీటిని పెంచడం కుదరదు. ఒకవేళ పెంచిన వీటి కలప వాణిజ్య అవసరాలకు ఉపయోగపడదు. సహజంగా పెరిగినప్పటికీ ఈ వృక్షాలలో అన్నీ సుగంధ పరిమళాన్ని వెదజల్లవు. ఉదాహరణకు అస్సాం అడవుల్లో 100 వరకు అగర్ వుడ్ వృక్షాలు ఉన్నాయి అనుకుంటే.. ఇందులో రెండు నుంచి ఏడు శాతం వరకే వాణిజ్య అవసరాలకు ఉపయోగపడతాయి. ఈ వృక్షాలు ఏపుగా పెరుగుతుంటా. వీటి పత్రాలు దళసరిగా ఉంటాయి. అగర్ వుడ్ దాదాపు 15 సంవత్సరాల తర్వాత పరిమళాన్ని వెదజల్లడం మొదలుపెడుతుంది. ఈ చెట్టు బెరడు తీసి వాసన పరిశీలించిన తర్వాతనే దానిని వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తారు. ఈ చెట్లు వెదజల్లే వాసనకు సర్పాలు వస్తుంటాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ వృక్షం కొమ్మల మీద రకరకాల జంతువులు ఆవాసం ఏర్పరచుకొని ఉంటాయి.
Also Read: వీఎస్ అచ్యుతానందన్ జీవితం.. ఒక పోరాట యోధుడి ప్రస్థానం!
కేవలం ఈశాన్య ప్రాంత అడవుల్లో ఈ వృక్షాలు పెరుగుతుంటాయి. ఆ నేలలో ఉన్న మృత్తికలు ఈ వృక్షాల ఎదుగుదలకు తోడ్పడుతుంటాయి. అందువల్లే ఇవి కేవలం ఆ ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంటాయి. కృత్రిమంగా వీటిని పెంచడం కుదరదు.. ఒకవేళ పెంచిన ఉపయోగం ఉండదు. అందువల్లే ప్రపంచంలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో ఎర్రచందనం అనేది అత్యంత విలువైన కలపగా ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అగర్ వుడ్ మాత్రమే అత్యంత ఖరీదైన కలప. దీని కేజీ విలువ కోటి రూపాయలు వరకు ఉంటుందంటే.. దాన్ని ఉపయోగించి ఎలాంటి పనులు చేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. మందుల నుంచి మొదలుపెడితే దేవుళ్లకు వెలిగించే ధూపం వరకు దీనిని వాడుతున్నారంటే దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల కాలంలో అగర్ వుడ్ కలప మీద రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలో ఉన్న ఔషధ గుణాలను దీర్ఘకాలిక రోగాల నయానికి ఉపయోగించే దిశగా పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు. ఒకవేళ అవి గనుక సత్ఫలితాలను ఇస్తే దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో ఈ చెట్టు కలపను ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆ ప్రయోగాలు ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్నాయి.