Homeజనరల్Gas Save Tips: గ్యాస్ ఆదా చేయాలని అనుకుంటున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే ఎంతో లాభం?

Gas Save Tips: గ్యాస్ ఆదా చేయాలని అనుకుంటున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే ఎంతో లాభం?

Gas Save Tips:  దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 1,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంది. వాణిజ్య అవసరాల కొరకు వినియోగించే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 2003 రూపాయలుగా ఉంది. ఈ సిలిండర్ సాధారణ గ్యాస్ సిలిండర్ తో పోల్చి చూస్తే ఐదు కిలోల ఎక్కువ బరువు ఉంటుందనే సంగతి తెలిసిందే.

భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ ధరలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా గ్యాస్ ఆదా చేయవచ్చు. గ్యాస్ మంట రంగు ఎప్పుడూ బ్లూ కలర్ లోనే ఉండాలి. అలా కాకుండా ఇతర రంగుల్లో ఉంటే గ్యాస్ మంట వచ్చే చోట చెత్త చిక్కుకుపోయి ఉండవచ్చు. గ్యాస్ మంట రంగు మారితే వెంటనే శుభ్రం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా గ్యాస్ మంటను తక్కువగానే ఉంచితే మంచిది. గ్యాస్ మంటను తక్కువగా ఉంచడం వల్ల కూడా గ్యాస్ ఆదా చేయవచ్చు. పాడైపోయిన లేదా కాలిన పాత్రలలో వంట వండటానికి ఆలస్యమవుతుంది. వంట కోసం వినియోగించే గిన్నెలను శుభ్రం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్యాస్ పైప్ లను తనిఖీ చేస్తూ గ్యాస్ లీక్ కాకుండా జాగ్రత్త పడాలి.

థర్మోస్‌లో మరిగించిన నీటిని, టీని ఉంచడం ద్వారా మళ్లీ వేడి చేయడాన్ని సులువుగా నివారించవచ్చు. ప్రెషర్ కుక్కర్‌ లో వంట చేయడం ద్వారా కూడా గ్యాస్ ఆదా అవుతుంది. వంట చేసే సమయంలో పాత్రపై మూత పెడితే కూడా గ్యాస్ ఆదా అవుతుంది. ఫ్రిజ్ లో ఉంచిన వస్తువులను వేడి చేయాల్సి వస్తే కొంత సమయం సాధారణ వాతావరణంలో ఉంచి ఆ తర్వాత వేడి చేస్తే మంచిదని చెప్పవచ్చు.

వంటకు అవసరమైన పదార్థాలను ఒకేచోట ఉంచి వంట చేస్తే తక్కువ సమయంలోనే వంట చేయడం సాధ్యమవుతుంది. తడి పాత్రలను స్టవ్ పై పెట్టకుండా తుడిచిన పాత్రలను స్టవ్ పై పెడితే గ్యాస్ ను ఆదా చేయడం సాధ్యమవుతుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version