Beer Price : బీర్ అంటే పడి చచ్చేవాళ్లకు ఇది నిజంగా పండగ లాంటి వార్తే. ఎండాకాలం వచ్చిందంటే చాలు బీర్ తాగాలనిపిస్తుంది. కానీ చాలాసార్లు మీకు ఇష్టమైన బ్రాండ్ దొరకక నిరాశ చెందుతుంటారు. అయితే ఇకపై అలాంటి బాధ ఉండదు. ఎందుకంటే ఈసారి సమ్మర్‌లో బీర్లు చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి. విషయం ఏంటంటే, బ్రిటన్ బీర్ బ్రాండ్లపై ఇండియాలో భారీగా ధరలు తగ్గాయి. భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పుణ్యమా అని బ్రిటన్ బీర్‌పై పన్ను ఏకంగా 75 శాతం తగ్గించేశారు. దీంతో ఇకపై బ్రిటన్ బీర్లు ఇండియాలో చాలా చౌకగా దొరుకుతాయి. కేవలం బీర్లే కాదు, బ్రిటన్ నుంచి వచ్చే స్కాచ్, విస్కీల ధరలు కూడా తగ్గాయి. అంటే ఇంతకుముందు రూ.200 పెట్టి కొనే బ్రిటన్ బీర్లు ఇకపై కేవలం రూ.50కే దొరికే ఛాన్స్ ఉంది.
మనదేశంలో బీర్ మార్కెట్ చాలా పెద్దది. ఇది మన దేశంలోని అతిపెద్ద మద్యం మార్కెట్లలో ఒకటి. 2024 లెక్కల ప్రకారం ఇండియన్ బీర్ మార్కెట్ దాదాపు రూ.50,000 కోట్ల విలువైనది. ప్రతి ఏటా ఇది సగటున 8-10 శాతం పెరుగుతూ వస్తోంది. ఈ మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణం సిటీల్లో ఉండే యువత. వాళ్ల సంఖ్య పెరుగుతోంది, లైఫ్‌స్టైల్ మారుతోంది, దాంతో బీర్‌కు డిమాండ్ బాగా పెరిగింది.
Also Read : తాగినోళ్లకు తాగినంత.. ఈ ఎండాకాలంలో పండుగ చేసుకోండి..
టాప్‌లో ఉండే బీర్ బ్రాండ్లు ఇవే
కింగ్‌ఫిషర్: ఇది మనదేశంలో బాగా పాపులర్ అయిన, ఎక్కువగా అమ్ముడయ్యే బీర్ బ్రాండ్. యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ దీన్ని తయారు చేస్తుంది.
హైనెకెన్: ఇది కాస్త ప్రీమియం బీర్. దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది.
కార్ల్స్‌బర్గ్: ఇది స్ట్రాంగ్ బీర్‌కు ఫేమస్. నార్త్ ఇండియాలో చాలా మంది దీన్ని తాగుతారు.
బిరా 91: ఇది మన ఇండియన్ క్రాఫ్ట్ బీర్ బ్రాండ్. యంగ్ జనరేషన్‌లో ఇది చాలా త్వరగా పాపులర్ అయింది.
బుడ్‌వైజర్: ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇండియాలో కూడా చాలా మంది దీన్ని ఇష్టపడతారు.
ఇండియాలో ఎక్కడ బీర్ ఎక్కువగా తాగుతారో తెలుసా?
మనదేశంలో బీర్ ఎక్కువగా సౌత్ స్టేట్స్‌లో తాగుతారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ టాప్‌లో ఉంటాయి. దానితో పాటు గోవాలో లిక్కర్ రూల్స్ కాస్త ఫ్రీగా ఉండటం వల్ల, టూరిస్టులు ఎక్కువగా రావడం వల్ల అక్కడ కూడా బీర్ బాగా అమ్ముడవుతుంది. నార్త్ ఇండియాలో ఢిల్లీ, చండీగఢ్‌లో కూడా బీర్ తాగేవాళ్లు ఎక్కువే. ఇంతకుముందు ఇండియాలో బ్రిటన్ నుంచి వచ్చే బీర్‌పై ఏకంగా 150 శాతం వరకు పన్ను ఉండేది. కానీ ఇప్పుడు కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఆ పన్నును 75 శాతానికి తగ్గించేశారు. పన్ను తగ్గింది కాబట్టి రేట్లు కూడా తగ్గుతాయి. రేట్లు తగ్గితే బీర్ తాగేవాళ్లకు మంచి లాభం కదా. ఇకపై బ్రిటన్ బీర్ ఇండియాలో చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. ఈ ఒప్పందం వల్ల బీర్ తాగేవాళ్లకే కాదు, బ్రిటన్ నుంచి వచ్చే చాలా వస్తువుల ధరలు తగ్గుతాయి.
Also Read : రేయ్ దారుణం రా ఇది.. బీరకాయలను అలా ఎవరైనా చేస్తారా..
వైన్ ధరలు మాత్రం తగ్గలేదు
భారత్, బ్రిటన్ మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మే 6న పూర్తయింది. కానీ ఇందులో ఇండియా బ్రిటన్ వైన్‌పై మాత్రం ఎలాంటి తగ్గింపు ఇవ్వలేదు. కేవలం బీర్‌పై మాత్రమే దిగుమతి సుంకం తగ్గించారు. అంటే బ్రిటన్ బీర్ మాత్రమే ఇండియాలో చౌకగా దొరుకుతుంది, వైన్‌పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు.