Pavan Kalyan About RRR: ఇద్దరు మాస్ హీరోలకు అదిరిపోయే కథ దొరికితే ఎలా ఉంటుందో మరోసారి సాటి చెప్పింది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతీయ సినీ లోకాన్ని ‘ఆర్ఆర్ఆర్’ ఓ ఊపు ఊపేస్తోంది. ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ కు పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ను అందించిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతోంది.

‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఏ సినిమా పోటీ లేకపోవడం, రాలేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్లు భారీగా ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఏ సినిమాకి జరగనంత భారీ స్థాయిలో ఈ సినిమాకి జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో బుకింక్స్ ఏ సినిమాకు రాలేదు అని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా షాక్ అవుతున్నారు.
Also Read: AP CM Y S Jagan: ఏపీ సీఎం జగన్ కు షాకిచ్చిన కోర్టు..
ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ ను తానే అని తెలుగు చిత్రసీమ మరోసారి సగర్వంగా నిరూపించుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్రానికి ఫిదా అయిపోయారు.
తాజాగా ఈ చిత్రం పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్పందనను తెలియచేస్తూ.. ‘ఆర్ఆర్ఆర్’ కథాంశంలోనే గొప్ప సందేశం ఉంది. బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులను రాజమౌళి గారు చక్కగా వివరించారు. ప్రతి సన్నివేశం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. రాజమౌళి గారి దర్శకత్వ పనితనం అద్భుతంగా ఉంది. కీలక పాత్రల్లో నటించిన ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
అసలు, ఎన్టీఆర్ – చరణ్ తెరపై ఇలా ఎలా కనిపించారో అని ఆలోచిస్తున్నా. అంత చక్కగా వాళ్ళ పాత్రలు కుదిరాయి. ఈ సినిమా క్లైమాక్స్ అయితే అద్భుతంగా ఉంది’ అని ప్రీమియర్ షోలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు.
Also Read: CSK Captaincy : చెన్నై కెప్టెన్సీ వదిలేసి మరో సారి షాకిచ్చిన ఎంఎస్ ధోని.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
Recommended Video:

[…] Pawan Kalyan: దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన నిజమైన నేత ఎవరంటే సుభాష్ చంద్ర బోస్ అని సమాధానం వస్తుంది. మహాత్మాగాంధీ వెనకుండి పోరాటం చేస్తే సుభాష్ ముందుండి భారత జాతిని నడిపించారు. స్వాతంత్ర్యం వైపు అడుగులు వేయించారు. యువతలో దేశభక్తి నింపారు. మాకు రక్తమివ్వండి మీకు స్వాతంత్ర్యం ఇస్తాం అంటూ ప్రజల్లో దేశభక్తిని ఇనుమడింపజేసిన మహానేత. నేతాజీ అనే పేరుకు సార్థకంగా ఆయన మన జాతికే మార్గదర్శకంగా నిలిచారు. స్వాతంత్ర్య పోరాటంలో దూకుడు ప్రదర్శించారు. శాంతితో లాభం లేదని ఎదురునిలిచి పోరాడేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. […]
[…] Also Read: Pavan Kalyan About RRR: ‘ఆర్ఆర్ఆర్’ టాక్ పై పవన్ కళ్… […]