Kitchen Tips: ప్రతీ ఒక్కరు అన్నం కూరతో కలుపుకుని తీసుకుంటుంటారు. అలా చక్కగా భోజనం చేయాలంటే కూర సరిగా కుదరాలి. అందులో ఉప్పు, కారం తగినంత ఉండాలి. ఎక్కువైతే మాత్రం చాలా కష్టం. కాగా, ఇలా కొన్ని సార్లు కూరల్లో ఉప్పు, కారం ఎక్కువవుతుండటం జరగొచ్చు. కాగా, అటువంటి సమయంలో కూర మొత్తం వేస్ట్ అయిందని బాధపడనక్కర్లేదు. ఈ సింపుల్ చిట్కాతో కూరలో ఉప్పు, కారం తగ్గించేయొచ్చు. ఎలాగంటే..

ఏదేని కూరలో ఉప్పు, కారం ఎక్కువైన క్రమంలో అందులో మైదా ముద్దలు వేసేస్తే సరిపోతుంది. ఆ ముద్దలు కూరలోని ఉప్పు, కారంను చక్కగా పీల్చేసుకుంటాయి. అలా ఉప్పు, కారం తగ్గిపోతాయి. అలా కాకుండా ఉప్పు, కారం తగ్గించడానికి మరో చిట్కా కూడా ఉంది . అదేంటంటే..
Also Read: లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాటలు ఇవే
బంగాళదంపలను అనగా ఆలుగడ్డలను మీది పొట్టు తీసేసి ముక్కలు చేసి ఆ ముక్కలను కూరలో వేసేస్తే సరిపోతుంది. ఆ ముక్కలు కూరలోని ఉప్పు, కారంను పీల్చేసి .. ఉప్పు, కారం తగ్గేలా చేస్తాయి. అలా మీరు చక్కగా కూరలోని ఉప్పు, కారం ను తగ్గించుకోవచ్చును. అయితే, కొందరు ఈ చిట్కా తెలియక మొత్తం కూరను పడేస్తుంటారు. అలా చేయడం వలన కూర వేస్ట్ అయపోతుంది. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో కూర లేదు కదా అని అన్నం కూడా పడేస్తుంటారు. అలా అన్నం, కూర రెండూ వేస్ట్ అవుతాయి.

ప్రతీ రోజు కొన్ని వేల మంది ఆకలితో అలమటిస్తున్న నేపథ్యంలో ఇలా ఆహార పదార్థాలను వృథా చేయడం సరి కాదు. కాబట్టి .. చక్కగా ఈ సింపుల్ చిట్కాను మీ ఇంట్లో అవసరమైనపుడు ట్రై చేసి ఆహార పదార్థాలను వృథా చేయకండి.. ఇకపోతే చాలా మంది గృహిణులు కూరల్లో వండేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కూడా. వంటలు వండే క్రమంలో కొంచెం కొంచెం ఉప్పు, కారం వేస్తుంటారు. అలా తక్కువ మొత్తంలోనే ఉప్పు, కారం వేస్తారు. ఫలితంగా కూరలు వేస్ట్ కాకుండా రెడీ అయిపోతాయి. ఇక వంట మాస్టర్లు అయితే వంటకాలు చేసే క్రమంలో చాలా జాగ్రత్తలు వహిస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూరల్లో ఉప్పు, కారం ఎక్కువ కాకుండా జాగ్రత్త పడుతుంటారు.
Also Read: కారం పొడితో చేసిన వంటకాలు ఎక్కువగా తింటున్నారా.. ఆ ప్రమాదకారమైన సమస్యలు!
[…] F3: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్‌తో మేకర్స్ తమ మ్యూజికల్ ప్రమోషన్‌లను స్టార్ట్ చేస్తున్నారు. తాజాగా సినిమాలోని మొదటి సాంగ్ ప్రోమో ‘లబ్ డబ్ లబ్ డబ్బూ’ పాట ప్రోమో విడుదలైంది. ఇక ఇందులో వెంకీ, వరుణ్ తేజ్ యూత్‌ఫుల్ అవతార్‌లో, ఉత్సాహంగా అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనిపించారు. […]