Ashes in the Ganges : హిందూ ధర్మంలో చనిపోయిన వారి అస్తికలు గంగలో కలిపితే వారు స్వర్గానికి వెళతారాని.. వారి ఆత్మ శాంతిస్తుందని రకరకాల నమ్మకాలున్నాయి. గంగానదిని దేశంలో దేవతగా.. పవిత్ర నదిగా కొలుస్తారు. ఇప్పటికీ గంగానది ఒడ్డున అనేక సంప్రదాయ కార్యక్రమాలు కూడా జరుగుతాయి.

ముఖ్యంగా గంగానది ఒడ్డున నిర్వహించే దహన సంస్కారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దహన సంస్కారాల అనంతరం చితాభస్మాన్ని గంగలో నిమజ్జనం చేసే సంప్రదాయం అనాదిగా వస్తోంది. మృతిచెందిన వారి దహన సంస్కారాలు చేసిన తర్వాత సమీపంలో గంగానది లేకపోతే .. మృతుల అస్తికలను ఒక కుండలో ఉంచి ఆ తర్వాత దానిని గంగానది దగ్గరకు తీసుకెళ్లి.. గంగలో నిమజ్జనం చేస్తారు.
అయితే గంగా నదిలో అస్తికలు నిమజ్జనం చేస్తే పుణ్యం అని చెబుతుంటారు. గంగానదిలో అస్తికలు నిమజ్జనం చేస్తే అవి ఎక్కడికి పోతాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతో మంది భారతీయ కుటుంబాల వారు ఇప్పటికే తమ చనిపోయిన వారి అస్తికలు గంగలో కలిపేస్తుంటారు. దేశమంతా అస్తికలు గంగనదిలో కలిపినప్పటికీ ఆ జలం ఇప్పటికీ ఎందుకు స్వచ్ఛంగా ఉంటుందన్నది ప్రశ్న..
దీని గురించి కాశీకి చెందిన పండితుడు పండిట్ దయానంద్ పాండే మాట్లాడుతూ.. సనాతన ధర్మంలోని విశ్వాసాల ప్రకారం బంధువుల మరణానంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని మృతుల అస్తికలను గంగలో నిమజ్జనం చేస్తారు. ఇది మంచి కార్యంగా పరిగణిస్తారు. ఈ అస్తికలను గంగానదిలో ప్రవహింపజేయడం ద్వారా నేరుగా శ్రీహరి పాదాల వద్దకు చేరుతాయని నమ్ముతారు. గంగానది దగ్గర మరణించిన వ్యక్తికి మోక్షం లభిస్తుందని కూడా నమ్ముతారు. దీనిపై చర్చలు జరుగుతుంటాయి.
ఇక సైన్స్ ప్రకారం.. గంగానదిలో విడిచిపెట్టిన ఎముకలలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ నీటిలో కరిగిపోతాయి. ఇది జలచరాలకు పోషక ఆహారంగా మారుతుంది. ఎముకలలో ఉండే సల్ఫర్ గంగా నీటిలో ఉండే పాదరసంతో కలిసి ఉప్పును ఏర్పరుస్తాయి. ఎముకల్లో మిగిలిన కాల్షియం నీటిని శుభ్రంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఇలా అస్తికలు కలిపితే గంగానది మరింత స్వచ్ఛంగా తయారవుతుందనే ఈ నియమం పెట్టారని నానుడి.
ఇక మతపరమైన కోణం నుంచి చూస్తే పరమశివుడికి విభూతి (బూడిద) అంటే చాలా ఇష్టమని.. అందరూ చివరకు బూడిదగా మారి శివుడిలో విలీనం అవుతారని ఈ నియం పెట్టారని భక్తిభావం గల వారు నమ్ముతారు.
[…] Cinema Viral : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. భారతరత్న లతా మంగేష్కర్ మృతిపట్ల ప్రముఖ సినీనటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. నైటింగేల్ ఆఫ్ ఇండియా, గొప్ప లెజెండ్‌లలో ఒకరైన లతా దీదీ ఇక లేరంటే గుండె పగిలినట్లు ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. లతా మంగేష్కర్ అసాధారణ జీవితాన్ని గడిపారని.. ఆమె సంగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుందన్నారు. […]
[…] Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తతం చేస్తోన్న క్రేజీ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కరోనా సోకి అలా 10 రోజులు ఐసొలేషన్ లో ఉన్న చిరంజీవి, కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలిన తర్వాత బయటకొచ్చారు. నేరుగా గాడ్ ఫాదర్ షూటింగ్ లొకేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తను కరోనా నుంచి కోలుకున్న విషయాన్ని ప్రకటించారు. […]