Kailesh Bhakthi: అభిషేక ప్రియుడు అయిన పరమ శివుడిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. భగవంతుడు తమ పూజలను మెచ్చి అనుగ్రహం ఇవ్వడంతో పాటు తమ కోరికలను నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మన దేశంలో శైవ క్షేత్రాలు అత్యధికంగా ఉంటాయి. ఇకపోతే శివుడిని పూజించేందుకుగాను భక్తులు ఆయా క్షేత్రాలకు పోటెత్తుతూనే ఉంటారు.

ఇక ఇక్కడ అయితే ప్రతీ రోజు తెల్లవారు జామున సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి స్నానమాచరిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం . ఆ ప్రదేశం ఎక్కడంటే.. హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం.. ఇది బ్రహ్మ సృష్టి అని భక్తులు వివరిస్తుంటారు కూడా. ఇక్కడకు వచ్చి పరమేశ్వరుడు ప్రతీ రోజు స్నానం చేస్తాడని చెప్తుంటారు. అంతటి పుణ్యప్రదేశం మానస సరోవరానికి ఒక్కసారైనా వెళ్లాలని శైవ భక్తులు అనుకుంటారు.
Also Read: లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాటలు ఇవే
ఈ మానస సరోవరం అత్యంత పుణ్య క్షేత్రమని భక్తులు అంటుంటారు. ఈ సరస్సులో దేవ దేవతలు ప్రతీ రోజు వచ్చి పరమ శివుడి దర్శన భాగ్యానికి నోచుకుంటారని పెద్దలు, పండితులు పేర్కొంటున్నారు. ఇకపోతే ఈ సరస్సు ప్రత్యేకత ఏమిటంటే… ఇందులోని నీరు ఎప్పుడూ ఎంతో స్వచ్ఛంగా, తియ్యగా ఉంటాయి. సాక్షాత్తు దేవ గంగ, ఇంద్రాద్రి దేవతలు ఈ సరస్సు పరిసర ప్రాంతాల్లో ఉంటారని వివరిస్తుంటారు.

ఇకపోతే మానస సరోవరంలో నీరు సూర్యుడి అస్తమయం, ఉదయం సమయంలో ఎంతో ఆహ్లదకరంగా, అందంగా ఉంటాయి. మానస సరోవరం.. క్షణ క్షణం రంగులు మారుతూ చూపరులను ఆకట్టుకుంటుంటుంది. పురాణాల ప్రకారం కూడా మానస సరోవరానికి చాలా ప్రాధాన్యత ఉంది. పరమేశ్వరుడు ఈ పర్వతంపైన ఉండి ముల్లోకాలను పాలించాడని వాటిలో పేర్కొన్నారు. జ్ఞానానికి, మోక్షానికి గుర్తుగా మానస సరోవరం ఉంటుందని, అది వాటికి ప్రతీక అని వివరిస్తారు. ఇకపోతే మానస సరోవరం అధిరోహించడం కూడా అంత సులువు కాదని, చాలా కష్టమైన పని అని చెప్తుంటారు. చాలా మంది శైవ భక్తులు మానస సరోవరం దర్శన భాగ్యం చేతనే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని వివరిస్తుంటారు. భోళా శంకరుడి కృపా కటాక్షాలు ఆ విధంగా మానస సరోవరం దర్శనం వలన కలుగుతాయని భక్తుల నమ్మకం కూడా. ఇకపోతే అభిషేక ప్రియుడైన శివుడికి నిత్యం శైవ క్షేత్రాల్లో పూజలు జరుగుతూనే ఉంటాయి.
Also Read: చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తల బంధం నిలబడాలంటే పాటించాల్సిన జాగ్రత్తలివే!