https://oktelugu.com/

Cumin: చిన్న చిట్కా తో మీ కొవ్వు నిమిషాల్లో మాయం..

మంచి పోషకాహారం తీసుకుంటూ దానికి తగ్గ వ్యాయమం చేస్తూ ఉండండి. ఆరోగ్యకరమైన శరీరం మీ సొంతం అవుతుంది. ఇక చిట్కా ఏంటంటే.. బెల్లం, జీలకర్రను తీసుకోవాలి.

Written By: , Updated On : December 15, 2023 / 12:33 PM IST
Cumin Benefits

Cumin Benefits

Follow us on

Cumin: ఈ మధ్య ఎక్కువ మంది ఊబకాయం, కొవ్వు వంటి సమస్యలతో ఎక్కువగా బాధ పడుతుంటారు. వీటికోసం ఆహారం తీసుకోవడం కూడా మానేస్తుంటారు. చాలా తక్కువ ఆహారం తీసుకుంటూ, డైట్ పాటిస్తుంటారు. కానీ కొందరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా మానేస్తుంటారు. స్లిమ్ బాడీ కోసం ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. అయితే ఆరోగ్యంతో పాటు శరీరాకృతి కూడా అందంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క చిన్న టిప్ ను పాటించండి మీకు చాలా మేలు చేస్తుంది. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా?

మంచి పోషకాహారం తీసుకుంటూ దానికి తగ్గ వ్యాయమం చేస్తూ ఉండండి. ఆరోగ్యకరమైన శరీరం మీ సొంతం అవుతుంది. ఇక చిట్కా ఏంటంటే.. బెల్లం, జీలకర్రను తీసుకోవాలి. ఇందులో జీలకర్రకు కొవ్వును కరిగించే శక్తి ఉంది. అంతేకాదు ఎముకలను బలహీనంగా మార్చకుండా, బలంగా ఆరోగ్యంగా ఉంచేలా పని చేస్తుంది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీంతో ఎముకల ఆరోగ్యం సరుక్షితం. మరి దీన్ని ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకోవాల్సిందేగా.. అది కూడా చూసేయండి.

ఓ స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఓ గ్లాస్ వాటర్ పోయండి. ఈ వాటర్ లో జీలకర్ర కూడా వేయాలి. అయితే నీటిలో జీలకర్ర బాగా మరిగితే అందులో ఉండే పోషకాలన్నీ కూడా నీటిలోకి వస్తాయి. ఓ ఐదు పది నిమిషాల్లోనే నీల్ల రంగు కూడా మారుతుంది. అంటే జీలకర్ర లోని పోషకాలు నీళ్లలోకి వచ్చాయని అర్థం. అయితే ఇదే నీటిలో బెల్లం కూడా వేసుకోండి. ఈ రెండు ఆరోగ్యకరంగా మీ కొవ్వును కరిగించడంలో ఎంతో సహాయపడుతుంది. అయితే కాఫీ, టీలు తాగే కంటే ఓ అరగంట ముందే ఈ నీటిని తాగండి. పరిగడుపున తాగడం వల్ల మీలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోవడం ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యకరమైన స్లిమ్ బాడీ కోసం ఈ చిట్కా వాడండి.