https://oktelugu.com/

Uddanam: ఉద్దానంపై రాధాకృష్ణ ఏడుపు మామూలుగా లేదుగా

తాజాగా సీఎం జగన్ ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం తో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం జుగుప్సాకరంగా ఉంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 15, 2023 / 12:36 PM IST

    Uddanam

    Follow us on

    Uddanam: జర్నలిజం అనేది అనేక దశల్లో ఉంటుంది. స్థాయి దాటుతున్న కొలది హుందాతనం కాపాడుకోవాల్సి ఉంటుంది. కానీ ఏపీలో అది దరిదాపుల్లో లేదు. చంద్రబాబుపై సాక్షి, జగన్ పై ఎల్లో మీడియా ఏడుపు మనం చూస్తూనే ఉంటాం. ఈ ఏడుపు ఒక స్థాయికి మించిపోతే మాత్రం అది ప్రజాస్వామ్యానికే విఘాతం. అయితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రం తన స్థాయికి మించి రాతలతో వెగటు పుట్టిస్తున్నారు. రోత రాతలతో అబద్దాలను కూడా నిజం చేస్తున్నారు.

    తాజాగా సీఎం జగన్ ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం తో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం జుగుప్సాకరంగా ఉంది. మొత్తం 785 కోట్ల రూపాయలతో వీటి నిర్మాణం పూర్తి చేశారు. 2019 సెప్టెంబర్ ఆరున కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తో పాటు ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో వీటిని నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందించాలని భావించారు. ఇంతలో కోవిడ్ వచ్చింది. ఎడతెగని జాప్యం జరిగింది. 2021లో ప్రారంభం కావాల్సిన ఈ పథకాలు.. రెండు సంవత్సరాల పాటు ఆలస్యమయ్యాయి. కానీ ఇవన్నీ చంద్రబాబు హయాంలో ప్రారంభించినవేనని… పూర్తి చేయడంలో జగన్ విఫలం చెందారని ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం వచ్చింది. అది వాస్తవ విరుద్ధమైన.. కల్పిత కథగా ఉంది.

    చంద్రబాబు హయాంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తో పాటు ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి రూపకల్పన చేయడం మాత్రం వాస్తవం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు సంబంధించి స్థల పరిశీలన కూడా చేశారు. శంకుస్థాపన కూడా పూర్తి చేశారు. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి 600 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కానీ పనులు ప్రారంభించలేదు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎక్కడికక్కడే పనులు నిలిచిపోయాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ విధానంతో ఈ పనులన్నీ రద్దు అయ్యాయి. కొత్తగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి.. పనులు ప్రారంభించిన వైసీపీ ప్రభుత్వం పథకాలను ప్రారంభించింది. అయితే చంద్రబాబు చేసిన పనులనే కలరింగ్ చేసి ప్రారంభించారని ఆంధ్రజ్యోతిలో కథనం మాత్రం చాలా అన్యాయం. ఇది వాస్తవ విరుద్ధం కూడా.

    ఈ ప్రాజెక్టుల విషయంలో జగన్ సర్కార్ వైఫల్యాలు రాయాలనుకుంటే చాలా ఉన్నాయి. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ భవనం నిర్మాణానికి నాలుగు సంవత్సరాల కాలం పట్టింది. ఇంతవరకు అక్కడ వైద్య నిపుణులను నియమించలేదు. సిబ్బంది భర్తీ కాలేదు. దీంతో కిడ్నీ వ్యాధులపై అధ్యయనం ఎలా ప్రారంభమవుతుంది? దీనికి నిధులు ఎలా సమకూర్చుతారు? కేంద్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? వైద్య పరీక్షలకు సంబంధించి పరికరాలు, యంత్రాలు అందుబాటులోకి తెచ్చారా? అన్న విషయాలపై సమగ్ర కథనం రాస్తే ఆసక్తిగా ఉంటుంది. ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం చంద్రబాబు ప్రయోజనాలను కాపాడేందుకే ఎక్కువగా ప్రయత్నించడం.. చంద్రబాబు హయాంలోనే పనులు జరగాయని చెప్పడం కొద్దిగా అతి అనిపిస్తోంది. ఈ రోత రాతలతో పాఠకులకు రోత పుట్టిస్తోంది