
Crypto Currency: క్రిప్టో కరెన్సీ అనేది ఏ దేశానికి చెందినది కాదు. రూపం ఉండదు. ఆన్లైన్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మాత్రమే చలామణి అవుతుంది. క్రిప్టో మైనింగ్ ప్రక్రియతో రూపుదిద్దుకున్న ఈ కరెన్సీ కి ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించినందున భరోసా లేదు. ఉదాహరణకి భారత కరెన్సీను తీసుకుంటే ఆ నోటిపై నోటు విలువకు తగిన మొత్తాన్ని భరోసానిస్తూ భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. క్రిప్టో కరెన్సీ కి ఆ రకమైన భద్రత ఏర్పాట్లు ఉండవు. అభివృద్ధి చెందిన పలు దేశాల్లోని బ్యాంకులు గడిచిన రెండు సంవత్సరాలుగా క్రికెట్ కరెన్సీ రూపంలో డిపాజిట్ల సేకరణకు ఆసక్తి చూపుతుండటంతో అప్పట్లోనే ఆర్థిక రంగ నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇక ప్రపంచ దేశాలు క్రిప్టో కరెన్సీ కి సంబంధించిన చట్టాలను, నిబంధనలను, మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉందని, అప్పటిదాకా క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేయడం తగదని ఆర్థిక నిపుణులు సూచించారు. నియంత్రణ వ్యవస్థ లేనిదే క్రిప్టో కరెన్సీని అనుమతించడం సరికాదని తేల్చి చెప్పారు. తొలినాళ్లలో పైపైకి ఎగిసిన క్రిప్టో కరెన్సీ విలువలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయని, క్రిప్టో కరెన్సీ విలువ గంటలు, నిమిషాల వ్యవధిలో మారుతుంటాయని, దీన్ని నియంత్రించడం కష్టమని చెప్పారు.
అమెరికాలో క్రిప్టో కరెన్సీ కి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు లేనప్పటికీ, కొన్ని నియంత్రణను పాటిస్తోంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీకి చెందిన ఆర్థిక నేరాల ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ ( ఫిన్ కెన్) క్రిప్టో కరెన్సీ లతో కూడిన లావాదేవీలను బ్యాంకులో ఎలా చేయాలో మార్గదర్శకాలు జారీ చేసింది. క్రిప్టో కరెన్సీలతో వ్యవహరించేటప్పుడు బ్యాంకులో ఇప్పటికే ఉన్న మనీ లాండరింగ్ నిరోధక చట్టం, నో యువర్ కస్టమర్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. అంతకుమించితే డిపాజిట్ లపై నియంత్రణలను పేర్కొనలేదు. దీంతో అమెరికాలోని అనేక రాష్ట్రాలు క్రిప్టో కరెన్సీల వినియోగంపై సొంతంగా నిబంధనలను రూపొందించాయి. న్యూయార్కు ఇందుకు సంబంధించి బిట్ లైసెన్స్ పేరుతో నిబంధనలను విడుదల చేసింది. దీని ప్రకారం బ్యాంకులతో సహా వర్చువల్ కరెన్సీ కార్యకలాపాలలో నిమగ్నమైన కంపెనీలు రాష్ట్రంలో పనిచేసే మందు లైసెన్స్ తీసుకోవాలి. ఇక్కడ కూడా క్రిప్టోప్ కరెన్సీలో డిపాజిట్లను చట్టబద్ధం చేయడం మినహా నియంత్రణ కొరవడింది.
సంక్షోభంలో ఉన్న ఏ బ్యాంకు అయినా మరింత కష్టాల్లో కూరుకు పోవడానికి ప్రధాన కారణం డిపాజిటర్ల విశ్వసనీత కోల్పోవడం. వారు తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవడం ఇందుకు కారణం. సిలికాన్ వ్యాలీ బ్యాంకు విషయంలోనైనా, సిగ్నేచర్ బ్యాంకు ఉదంతంలో అయినా ఇదే జరిగింది. డిపాజిటర్లు ఒక్కసారిగా తమ నిల్వలను విత్ డ్రా చేసుకోవడంతో అవి పతనమయ్యాయి. అమెరికాలో బ్యాంకు ఖాతాదారుల డిపాజిట్లకు ఇన్సూరెన్స్ ఉంటుంది. తదారుల డిపాజిట్లకు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బాధ్యత కల్పిస్తుంది. అయితే రెండు లక్షలు 50 వేల డాలర్ల లోపు డిపాజిట్లకే ఈ భద్రత ఉంటుంది.
సిలికాన్ వ్యాలీ, సిగ్నేచర్ బ్యాంకు లో సింహాహాభాగం ఖాతాదారుల నిల్వలు ఈ పరిమితికి మించి ఉన్నాయి. దీంతో ఆందోళన చెందిన ఖాతాదారులు మొక్కుమడిగా విత్ డ్రాలు చేయడంతో రెండు బ్యాంకులు పతనమయ్యాయి. ఇక అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాంకులు క్రిప్టో కరెన్సీ మొగ్గు చూపుతున్నాయి. క్రిప్టో రూపంలో డిపాజిట్ల సేకరణకు ఉవ్విళ్ళురుతున్నాయి. క్రిప్టో కరెన్సీ మార్పిడి ఫ్లాట్ ఫారాలను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు సిగ్నేచర్ బ్యాంకు ఉదంతంతో ఆయా బ్యాంకులు క్రిప్టో కరెన్సీ డిపాజిట్ల విషయంలో వెనుకంజ వేస్తున్నాయి. పైగా క్రిప్టో కరెన్సీని సైబర్ నేరగాళ్లు నిత్యం లక్ష్యంగా చేసుకుంటారు. హ్యాకర్ల దాడులు జరిగినప్పుడు ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం బహిర్గతమవుతుంది. నేపథ్యంలో ప్రతిష్ట భద్రత వ్యవస్థలు, బ్యాంకులకు సైబర్ సెక్యూరిటీ పై, మార్గదర్శకాలు, క్రిప్టో కరెన్సీ నియంత్రణ పై చర్యలు అవసరమని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.