
Why Ramoji Rao Worked against NTR: ఎన్టీ రామారావు విజయావకాశాలు అందుకోవడంలో రామోజీరావు పాత్ర కీలకమని అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో చేపట్టిన పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుళ్లేందుకు ఈనాడు పత్రిక సహకారంతో ఎంతగానో తోడ్పాటునందించారు. మరి అటువంటి రామోజీరావు ఒకానొక సమయంలో వ్యతిరేకంగా పనిచేశారని మీకు తెలుసా.. అయితే చదవండి
భార్య చనిపోయి బాధతో ఉన్న ఎన్టీ రామారావుకు లక్ష్మీ పార్వతి దగ్గరయ్యారు. ఆమెను భాగస్వామిగా చేసుకుంటానని ఆయన ప్రకటించారు. ఇది చంద్రబాబు, రామోజీరావుకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇది చెప్పినా ఎన్టీఆర్ వినలేదు. లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసేసుకున్నారు. అప్పుడు 1994 ఎన్నికల సమయం. రామోజీరావు చెప్పిన మాటలను ఎన్టీ రామారావు చెవినకెక్కించుకునేవారు కాదట. దాంతో ఆయనను బద్ద విరోధిగా చూశారు.
ఇక, అప్పటి నుంచి ఈనాడులో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా రామోజీరావు కథనాలు వేడివేడిగా కథనాలు వండివార్చేవారట. సారా వ్యతిరేక ఉద్యమం చేపట్టినప్పుడు రామోజీ కూడా ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా జెండా పట్టుకొని పోటీగా సారా ఉద్యమం నిర్వహించారు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతుందని ప్రచారం కూడా చేశారు.
తమ రిపోర్టు ప్రకారం తెలుగుదేశం ఓడిపోతుందని ఈనాడులో కథనాలు వేశారు. ఎన్టీఆర్ ను నిరాశ, నిస్ప్రహకు గురి చేసి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడమే ముఖ్య ఉద్దేశ్యమని లక్ష్మీ పార్వతి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. కానీ, ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అప్పటి నుంచి రామోజీరావు కూడా సర్దుబాటు ధోరణిలో ఉన్నా, చంద్రబాబుతో కలిసి కుట్రలు చేసేవారట. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఇతోధికంగా రామోజీ సహకారం అందిస్తూనే ఉన్నారు.