
Liquor Scam Troll: లిక్కర్ స్కాం… ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని గురించే చర్చ. మొన్న కవిత విచారణకు వెళ్ళింది. మళ్లీ 16వ తారీఖు రమ్మని ఈడి కబురు పంపింది. తర్వాత ఏం ప్రశ్నలు అడుగుతుందో? ఎలా ఇబ్బంది పెడుతుందో ? అని గులాబీ శిబిరంలో ఆందోళన నెలకొంది. అందు గురించే ఆ కుటుంబంలో ఆ నలుగురు నోరు మెదపడం లేదు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికి పని చెబుతున్నారు. ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.. మరి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా వింగ్ రకరకాల ప్రచారాలు చేస్తోంది. కవితను విచారించిన ఆరోజు రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. సిఐఎస్ఎఫ్ పరేడ్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా వింగ్.. “వెల్ కమ్ టూ నిర్మా” అంటూ వినూత్నంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. దీనికి బిజెపి నాయకులు సరయిన స్థాయిలో కౌంటర్ ఇవ్వకపోయినప్పటికీ.. కొంతమంది యూట్యూబ్ ఎడిటర్లు విభిన్నంగా ఆలోచించారు. కవిత గతంలో చేసిన పనులను ఉటంకిస్తూ వీడియో రూపొందించారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది.
కవిత పేరు లిక్కర్ స్కామ్ లో వినిపించినప్పుడు భారత రాష్ట్ర సమితి నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థలపై విరుచుకుపడ్డారు.. కవితకు ఉన్న పేరును బద్నాం చేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కానీ ఎప్పుడైతే కవిత ఐఫోన్లను ధ్వంసం చేసిందో, వాటి ఐఎంఐ నెంబర్లతో సహా నిరూపించడంతో భారత రాష్ట్ర సమితి నాయకులు కంగు తిన్నారు. దీనికి ఎలా కౌంటర్ ఇవాలో తెలియక బండి సంజయ్ ఎప్పుడో అన్న మాటలను ఇప్పుడు ప్రస్తావిస్తూ నిరసనలు చేపడుతున్నారు. తెలంగాణ జనం ఈ వ్యవహారాన్ని చూసి నవ్వుతున్నారు.

ఇక లిక్కర్ స్కాం లో తన పేరు వినిపించిన తర్వాత పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సమయంలో పలు విషయాలపై క్లారిటీ ఇచ్చింది. కానీ ఆమె 2014 ఎన్నికలకు ముందు వెల్లడించిన వివరాలను, ఇప్పుడు మీడియాకు చెబుతున్న విషయాలను సరి పోల్చుతూ యూట్యూబర్లు ట్రోల్ చేస్తున్నారు. ఏ మాటకు ఆ మాటే ఆ బిజెపి నాయకులు వీరి వద్ద శిక్షణ తీసుకుంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే బిజెపిలో ప్రస్తుతం నెంబర్ 2 గా కొనసాగుతున్న అమిత్ షాను భారత రాష్ట్ర సమితి నాయకులు ట్రోల్ చేస్తుంటే ఏమీ చేయలేకపోతున్నారు. కానీ ఇదే యూట్యూబర్లు మాత్రం కవితను ఒక ఆట ఆడుకుంటున్నారు. లిక్కర్ రాణి అనే బిరుదు తగిలించారు. అంతేకాదు సారా దందా ఎంత నీచమో కళ్ళకు గట్టారు.