TTD Tickets: తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించు కునే భక్తులకు టిటిడి సంస్థ భారీ షాక్ ఇచ్చింది. నిన్న టిటిడి శ్రీవారి ఉదయాస్తమాన సేవ టికెట్ ధర నిర్ణయించింది. భక్తితో శ్రీవారిని దర్శించు కోవడానికి వచ్చిన వారి నుండి ఏదొక రూపంలో డబ్బులు వసూలు చేస్తుంది టిటిడి. శ్రీవారి భక్తులు అంటే ఏటీఎం మెషీన్ లాగా భావిస్తున్నారు అధికారులు. శ్రీవారి ఉదయాస్తమాన సేవ పేరుతొ కూడా టికెట్ రూపంలో డబ్బులు వసూలు చేయడానికి రెడీ అవుతుంది.

అయితే టిటిడి కొత్తగా నిర్ణయించిన ఈ సేవ టికెట్ ధర ఎంతో తెలిస్తే భక్తులు షాక్ అవ్వడం ఖాయం. ఉదయాస్తమాన సేవ అంటే ఉదయం నుండి రాత్రి వరకు శ్రీవారి సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తారు. స్వామి వారికీ తెల్లవారు జాము నుండే ప్రారంభం అయ్యే సేవలను అర్ధరాత్రి నిద్రపుచ్చే వరకు అన్ని సేవల్లో పాల్గొనేలా టిటిడి అనుమతి ఇస్తుంది.
అయితే టిటిడి ఉదయాస్తమాన సేవ టికెట్ ధరను కోటి రూపాయలుగా నిర్ణయించి సాధారణ భక్తులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఉదయాస్తమాన సేవ టికెట్ ధర మాములు రోజుల్లో కోటి రూపాయలుగా నిర్ణయించారు. అయితే అదే సేవ శుక్రవారం రోజు టికెట్ ధర మాత్రం ఇంకొంచెం ఎక్కువ నినాయించారు. శుక్రవారం ఉదయాస్తమాన సేవ లో పాల్గొనే భక్తులు కోటిన్నర చెల్లించాల్సి ఉంటుందట.
Also Read: శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసిన టీటీడీ అధికారులు..ఎలా బుక్ చేయాలంటే?
టిటిడి దగ్గర ప్రస్తుతం 521 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయట. వాటిని మాత్రమే అమ్మాలని నిర్ణయించారు. ఒక్కసారి కోటిన్నర, కోటి పెట్టి టికెట్ కొంటె.. పాతికేళ్ల పాటు ఏడాదిలో ఒక్క రోజు పాటు ఉదయాస్తమాన సేవ లో పాల్గొనవచ్చు. అయితే ఈ డబ్బులన్నీ టిటిడి కోసం కాదని.. టిటిడి నిర్మిస్తున్న చిన్న పిల్లల ఆసుపత్రి కోసం అని టిటిడి వర్గాలు చెబుతున్నారు.
521 టికెట్ లను భక్తులకు అమ్మి ఆ వచ్చిన డబ్బుతో చిన్న పిల్లలకు ఆసుపత్రి నిర్మిస్తామని చెబుతున్నారు. అయితే చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి కోట్ల రూపాయల విరాళం ఇచ్చి, నిర్మించి మరీ ఇస్తామని ముంబైకి చెందిన ఒక సంస్థ ముందుకు వచ్చిందని.. ఆ సంస్థతో ఎంఓయూ కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. ఆ ఒప్పందం ఏమయ్యిందో కానీ ఇప్పుడు మాత్రం ఉదయాస్తమాన సేవ పేరుతో టికెట్స్ అమ్మి ఆసుపత్రి కట్టాలని అనుకుంటున్నారు.
Also Read: టీటీడీలో సంపన్నులదే రాజ్యం.. వారి క్లబ్ గా మారిపోయిందా?