SP Balasubrahmanyam: ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం..’ మహా సినీ ఘన గాన గంధర్వుడు. ఆయన పాటకు భాషలతో సంబంధం లేదు, ప్రాంతాలతో పని లేదు. అన్నీ బాషల వారని అన్నీ ప్రాంతాలను ఆయన పాట ఒక మధురమైన మేఘంలా కమ్మేసింది. ఆయన గాత్రంలోని వైవిధ్యం కోట్లాది ప్రజలను సమ్మోహితులను చేసింది. బాలు గారి సినీ ప్రయాణం అర్థ శతాబ్దాన్ని దాటిన మహా ప్రయాణం. ఆయన పాడిన పాటలు అనితరసాధ్యం.. ఏకంగా అర లక్షకు మించిన పాటలు, మరో గాయకుడు ఎన్నటికీ సాధించలేని రికార్డు ఇది.

అసలు బాలు పాట లేనిది భారతీయ సంగీతమే లేదు. ఆయన సుప్రభాతమే భారతావనిని మేల్కొలుపుతుంది. అంతెందుకు, పొత్తిళ్లలో పసి పాప చిరునవ్వులు చిందించాలన్నా.. ఆయన పాడిన జోలపాడి లాలించే పాటనే వినిపించాలి. ఇక కుర్రాళ్ళు కలల ప్రపంచంలో వయ్యారాల జలపాతంలా సాగే వెన్నెలమ్మాయిల ఊహా భావాలను అనుభవించాలన్నా.. బాలు గారి పాటే బాట. అలాగే గుండె నిండా దిగులు చెందితే.. ఆ బాధలు భయాల నుండి బయట పడటానికి బాలు గారి పాటే ఆయుధం, ఇక విరహపు వేదనల ఆవేదనలకు ఓదార్పు బాలు గారి గానమాధుర్యమే.
Also Read: నటి మంచు లక్ష్మి చేతికి రక్తం.. అసలు ఏమైంది?
కుళ్ళిన సమాజంలోని పచ్చి నిజాలను నిలువెత్తు వెలిగెత్తి చాటాలన్నా.. బాలు గారి విప్లవ గాత్రమే సూత్రం. అందుకే కోట్లాది గొంతుకుల చప్పుడుకైనా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మళ్ళీ పుట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. నిజంగా అలాంటి ఆయన ఈ లోకాన్ని విడిచిన సమయంలో ఆయన అభిమానులతో పాటు యావత్తు సినీ లోకమంతా తీవ్ర ఆందోళనకు గురైంది.
ఇక ఆయన విలువైన పాటలు వినబడవు, ఆయన స్వచమైన నవ్వులు కనబడవు అని భారతీయ సంగీత లోకం కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో దశాబ్దాలుగా తన పాటల్లోని బావలతో ఊహల్లో ఊరించి, ఊగించిన ఆ నిలువెత్తు మనిషి ఇక లేడు అని సినీ కళామతల్లి కూడా కలత చెందింది. ఆ కలత తీర్చడానికైనా ఆయన మళ్ళీ పుడితే బాగుండు.
Also Read: గిన్నిస్ బుక్లో స్థానం దక్కించుకున్న ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్