Corona Virus: కొవిడ్ పుట్టిళ్లు చైనాలో మరోమారు కరోనా రక్కసి వెంటాడుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. ఫలితంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిత్యావసర వస్తువుల కోసం సైతం బయటకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజల బాల్కనీ, కిటికీల ధగ్గరే ఉంటూ కేకలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో చైనా వైరస్ కు మరోసారి బలైపోతోంది.

షాంఘై నగరంలో కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న 1100 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు తెలుస్తోంది. దేశంలో కరోనాను రూపుమాపాలని చూస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆదివారం దాదాపు 24 వేల కేసులు వెలుగు చూడటంతో ప్రజల్లో భయం నెలకొంది.
Also Read: ఎన్ని పూజలు చేసినా అనుకూల ఫలితాలు దక్కడం లేదా.. చేయకూడని తప్పులివే!
కరోనా ఆంక్షలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కఠినమైన ఆంక్షలతో కకావికలం అవుతున్నారు. ఇళ్లలోనే ఉంటున్నారు. కరోనా పుట్టడానికి కారణమైన చైనా తగు మూల్యమే చెల్లిస్తోంది. లాక్ డౌన్ ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వైరస్ ప్రస్తుతం చైనాలో తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఎవరు తోడుకున్న గోతిలో వారే పడతారనే నానుడి ప్రకారం చైనా కరోనా వైరస్ కు భారీ మూల్యమే చెల్లించుకుంటోంది.
లాక్ డౌన్ తో ప్రజలు నీరు, ఆహారం, కూరగాయల కోసం తాపత్రయడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దనే హెచ్చరికలతో ఇళ్లల్లోనే ఉంటున్నారు. దీంతో చైనా దేశం కరోనా కేసులతో అట్టుడికిపోతోంది. ఆస్పత్రుల నుంచి విడుదలైన బాధితులు హోం క్వారంటైన్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ చైనాను మరోసారి నిద్ర పోనివ్వకుండా చేస్తోంది. దీనిపై ప్రపంచమే ఓ కన్ను వేస్తోంది.
Also Read: మీ పిల్లలకు పేర్లు పెడుతున్నారా.. అస్సలు చేయకూడని తప్పులు ఇవే!
[…] Also Read: మరోసారి చైనాను వెంటాడుతున్న కరోనా వై… […]