Sucharita Resign: వైసీపీలో మంత్రుల మార్పు అగ్గి రాజేసింది. ముందుగా ఊహించనట్టుగానే కొందరిని కొనసాగించడంతో పదవి కోల్పోయిన మంత్రులు భగ్గుమంటున్నారు. ఇంకొందరు తమకు మంత్రి పదవి రాలేదని రెబల్స్ గా మారి తమ అనుచరులతో నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు. అయితే మొన్నటి వరకు హోం మంత్రిగా పనిచేసిన మేకపాటి సుచరితను తొలగించడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

తన సామాజిక వర్గానికి చెందిన వారిని అందరినీ కొనసాగించిన జగన్.. కేవలం తనను మాత్రమే తొలగించడంతో తాను ఏం తప్పు చేశానంటూ వాపోయారు. ఈ మేరకు నిన్న రాత్రి ఆమె కుమార్తె సంచలన ప్రకటన చేశారు. తన తల్లి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.
Also Read: భగభగలు.. వైసీపీలో 11మంది అసంతృప్తి జ్వాలలు.. ఈరోజే కీలకం..?
అయితే ఆమె కేవలం ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేస్తోందని, పార్టీకి కాదని స్నప్టం చేశారు. మిగతా ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా రాజీనామా చేయొద్దంటూ కోరారు. పార్టీకి నష్టం చేకూర్చొద్దంటూ విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పటికే ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆమె మద్దతు దారులు చాలామంది రాజీనామాలు సమర్పించారు.
దీంతో పార్టీలో అగ్గి రాజుకుంది. సామాజిక వర్గాల ఆధారంగా జగన్ తీసుకున్న నిర్ణయం.. చివరకు సుచరిత రాజీనామా చేసేదాకా వెళ్లింది. అయితే జగన్ ఆమెను బుజ్జగించే పనుల్లో పడ్డట్టు తెలుస్తోంది. మరి ఆమె మనసు మార్చుకుని రాజీనామాను వెనక్కు తీసుకుంటారా లేదంటే పంతానికి పోతారా అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం .. షాకిచ్చిన అసంతృప్తి నేతలు