Colour Therapy: ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అయితే కొందరికి ఒక రంగు (Colour) నచ్చితే మరికొందరికి ఇంకో రంగు నచ్చుతుంది. ఆ రంగును బట్టి వారి మనస్తత్వాన్ని కొందరు నిర్ణయిస్తారు. కొన్ని రంగులు మనస్సుకు ప్రశాంతతను ఇస్తే.. మరికొన్ని రంగులు మనస్సుకు చిరాకును ఇస్తుంది. అయితే కొందరు వారు ఇష్టపడే రంగును బట్టి వారి మనస్తత్వాన్ని లెక్కిస్తారు. ఆ రంగుల బట్టి వారి మానసిక స్థితి ఉంటుందని భావిస్తారు. ఈ రంగులు కేవలం మానసిక ఆరోగ్యం మీద మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందట. రోజూ మనం ధరించే దుస్తుల రంగు మన మూడ్‌ను మారుస్తుంది. ఇవి మన మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్నే కలర్ థెరపీ లేదా క్రోమో థెరపీ అంటారు. ఈ చికిత్స వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏ రంగు వల్ల ఎలాంటి ప్రయోజనాలో చూద్దాం.
ఎరుపు రంగు
అ రంగు వల్ల అదనంగా శక్తి లభిస్తుంది. అలాగే బాగా ఒత్తిడికి గురై ఉంటే ఇంకా పెంచుతుంది. దీన్ని ఎక్కువగా డేంజర్‌కి గుర్తుగా భావిస్తారు. అందుకే ఎక్కువగా రెడ్‌ను చాలా మంది వాడరు. ఈ రంగు ధరించడం వల్ల కాస్త ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయి.
నీలం రంగు
ఈ రంగు వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారట. నీలం రంగు ధరించిన వాళ్లు ఎలాంటి సమస్య వచ్చిన కూడా కూల్‌గా ఆలోచిస్తారు. నీలంలో ఉన్న అన్ని రంగులు కూడా ఆందోళనను తగ్గి్స్తాయి. అలాగే నిద్రను కూడా మెరుగుపరుస్తాయి. ఎవరైతే నిద్రలేమితో ఎక్కువగా బాధపడుతున్నారో.. వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఆకుపచ్చ రంగు
ఈ ఆకుపచ్చ రంగును శాంతికి చిహ్నంగా భావిస్తారు. దీనివల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉంటారని భావిస్తారు.
ఆరెంజ్ రంగు
ఈ రంగు ధరించడం వల్ల మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటారు. అలాగే ఇది ఆకలిని కూడా పెంచుతుంది. అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. దీనివల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.