Sky Force Movie Review
Sky Force Movie Review: సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన కథంశాలను ఎంచుకుంటూ మన హీరోలు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రతి హీరో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికైతే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు మాత్రం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని సంపాదించుకునేందుకు కుతూహలంతో ఉన్నారు. ఇక అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సైతం వరుసగా డిజాస్టర్లు బాట పట్టిన నేపథ్యంలో రీసెంట్ గా ‘స్కై ఫోర్స్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇండియన్ ఆర్మీ మీద పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తుంది. దాంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రహస్యంగా పాకిస్తాన్ కు వెళ్లి అక్కడ వాళ్ళను ఎలాంటి దెబ్బతీశారు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే సందీప్ కెవ్లేని , అభిషేక్ అనిల్ కపూర్ అనే ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లడంలో దర్శకులు ఇద్దరు కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయితే ఇదే కాన్సెప్ట్ తో ఇంతకుముందు బాలీవుడ్ లో గాని టాలీవుడ్ లో గాని కొన్ని సినిమాలైతే వచ్చాయి. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ఆపరేషన్ వాలంటీర్’ సినిమా కూడా ఇలాంటి కథాంశం తోనే తెరకెక్కడం విశేషం…
మరి ఇలాంటి సందర్భంలో సినిమా స్క్రీన్ ప్లే లో చాలా వరకు దర్శకులు చాలా బాగా కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రతి ఎలిమెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వాళ్ళ అభిరుచి మేరకు దాన్ని తీర్చిదిద్దడంలో దర్శకులు చాలా వరకు సక్సెస్ అయ్యారు. ప్రతి సీన్ తో వాళ్లు అనుకున్నట్టుగా సినిమా మీద హైప్ అయితే పెంచే ప్రయత్నం చేశారు. ఇక సినిమాలో చాలా చోట్ల ఎలివేషన్ సీన్స్ చాలా బాగా పండించారు. ముఖ్యంగా వార్ నేపథ్యంలో సాగిన సీన్లు అయితే ప్రేక్షకులను బాగా అలరిస్తాయి…
ఇక సీన్లు కొన్ని మధ్యలో రొటీన్ గా అనిపించినప్పటికి ట్రీట్మెంట్ లో కొత్తదనాన్ని అనుసరిస్తూ వచ్చారు. కాబట్టి ఎప్పటికప్పుడు సినిమా మీద హైప్ వచ్చే విధంగా స్క్రీన్ ప్లే ను నడిపించే ప్రయత్నం అయితే చేశారు… అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాకి తన ప్రాణం పెట్టి నటించడానే చెప్పాలి. ఇంటర్వెల్ లో వచ్చిన సీన్స్ కొన్ని నేచురాలిటికి దగ్గరగా లేనప్పటికీ సినిమాటిక్ లిబర్టీని తీసుకొని అలాంటి సీన్స్ ను క్రియేట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే అక్షయ్ కుమార్ ఎప్పటిలానే ఈ సినిమా కోసం కూడా చాలా విపరీతంగా కష్టపడినట్టుగా తెలుస్తోంది… ఇక మొదటి నుంచి చివరి వరకు తనే ఈ సినిమాని భుజాల మీద మోసుకెళ్లాడనే చెప్పాలి. ఇక అక్షయ్ తోపాటు వీర్ పహరియా కూడా చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. అలాగే ‘సారా అలీ ఖాన్’ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. నిమ్రత్ కౌర్, శరత్ కేల్కర్ లాంటి నటులు సైతం వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయి నటించి సినిమా సక్సెస్ లో చాలా కీలకపాత్ర వహిస్తూ వచ్చారు…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ ఈ సినిమాకి ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందువల్లే సినిమా లో కొన్ని మేజర్ సీన్స్ లో ముఖ్యంగా వార్ నేపధ్యం లో సాగే సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా హెల్ప్ చేసిందనే చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి చాలా సినిమాటోగ్రాఫర్ రాసుకున్న విధానం కానీ దాన్ని తెరమీద చూపించిన పనితనం కానీ చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలావరకు ఓకే అనిపించేలా ఉన్నాయి…
ప్లస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
అక్షయ్ కుమార్
వార్ సీన్స్
మైనస్ పాయింట్
రోటీన్ కథ
అనవసరపు సీన్స్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5