sleep
Sleep : అపర మేధావి చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు జీవితానికి సంబంధించిన విలువైన చాలా విషయాలు చెప్పారు. వీటిని చాలా మంది అప్పటి నుంచి ఇప్పటి వరకు పాటిస్తూ తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు. వీటిలో మనుషులు ఎలాంటి అలవాట్లు అలవరుచుకోవాలి? ఏ విధంగా జీవితాన్ని మలుచుకోవాలి? అనే విషయాలపై ప్రత్యేకంగా చెప్పాడు. వీటిలో నిద్రపోవడం గురించి చాణక్యుడు కొన్ని విషయాలను చెప్పాడు. సాధారణంగా ప్రతీ మనిషికి నిద్ర తప్పనిసరి చిన్న పిల్లలు కనీసం 10 గంటలు పెద్ద వాళ్లు 8 గంటల వరకు నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే చాలా మంది ఎప్పుడు సమయం దొరికితె అప్పుడు నిద్రపోతున్నారు. ముఖ్యగా మధ్యాహ్నం కాస్త సమయం దొరికితే ఓ కునుకు తీస్తుంటారు. కానీ మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయని చాణక్య నీతి తెలుపుతుంది. అవేంటో తెలుసా?
మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఓ కునుకు తీయాలని చాలా మంది అనుకుంటారు. కొందరైతే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిద్రపోయే వాళ్లు ఉన్నారు. కానీ ఇలా నిద్రపోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల అజీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే అలసత్వం పెరిగిపోతుంది. ఉద్యోగులు మధ్యాహ్నం నిద్రపోతే రకరకాల వ్యాధులు ఎదుర్కుంటారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కాస్త రిలాక్స్ గా ఉండవచ్చు.
మధ్యాహ్నం నిద్రపోయిన వారికి ఆయుష్షు తగ్గుతుందని చాణక్య నీతి తెలుపుతుంది. ‘ఆయుక్తయి దివ నిద్ర’ అనే శ్లోకం ప్రకారం మనిషి శ్వాసను లెక్కిస్తాడని అంటారు. నిద్రపోతున్నప్పుడు మనిషి వేగంగా శ్వాస తీసుకుంటారు. అయితే మధ్యాహ్నం నిద్రపోవాల్సి వస్తే ఎక్కువ శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల మనసు ఆందోళనగా ఉంటుంది.
చాణక్యుడి నీతి ప్రకారం మధ్యాహ్నం నిద్రపోయేవారిలో అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ఒక పనిని మొదలుపెట్టిన తరువాత మధ్యాహ్నం నిద్రపోవాల్సి వస్తే ఆ పనిని పూర్తి చేయలేరని చాణక్య నీతి తెలుపుతుంది. అలాగే మధ్యాహ్నం నిద్రపోయేవారిలో స్వీయం నియంత్రణ కోల్పోతారు. దీంతో ఏ పనిని చక్కగా చేయలేరు. మనసు ఉత్తేజాన్ని కోల్పోయి నిరాశతో ఉంటారని అంటున్నారు. ఇక ఇలాంటి వారు బాధ్యతలు చక్కగా నిర్వర్తించని కూడా తెలుపుతున్నారు.
మధ్యాహ్న సయంలో నిద్ర పోవడం వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రి సమయంలో ఎక్కువ సేపు మెళకువతో ఉండడం వల్ల మెదడు చురుకుదనాన్ని కోల్పోతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు రాత్రి మాత్రమే ఎక్కువసేపు నిద్రపోవాలి. మధ్యాహ్నం ఏదో ఒక పనితో యాక్టివ్ గా ఉండాలి. లేదా అందమైన మ్యూజిక్ వినాలి. లేదా ఏదో ఒక పని వ్యాపకాన్ని ఏర్పాటు చేసుకొని దానిపై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం వల్ల మధ్యాహ్నం నిద్ర పోకుండా ఉంటారు. ఇక చాలా మంది కార్యాలయాల్లో నిద్రపోతుంటారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగభద్రత కూడా లేకుండా పోతుంది. అంతేకాకుండా అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది.