https://oktelugu.com/

Coconut water : కొబ్బరినీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి…

Coconut water : ఎండాకాలం రాగానే చల్లటి ద్రవ పదార్థాలను తాగాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూల్ డ్రింక్ కంటే నాచురల్ గా లభించే వాటినే తాగడం వల్ల ఎంతో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written By: , Updated On : April 2, 2025 / 02:00 AM IST
Coconut water

Coconut water

Follow us on

Coconut water : ఎండాకాలం రాగానే చల్లటి ద్రవ పదార్థాలను తాగాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూల్ డ్రింక్ కంటే నాచురల్ గా లభించే వాటినే తాగడం వల్ల ఎంతో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో కొందరు కొబ్బరి నీళ్లు వంటివి సేవిస్తున్నారు. కొబ్బరినీళ్ళలో పొటాషియం, సోడియం కలిగిన ఎలక్ట్రోలర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది తాగడం వల్ల తక్షణంగా ఎనర్జీ ఇవ్వడంతో పాటు రోజంతా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో శరీరం డిహైడ్రేషన్ కాకుండా ఉండడానికి కొబ్బరి నీళ్ళు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే కొబ్బరి బొండం కొనే సమయంలో కొన్ని విషయాలు తప్పక గమనించాలని అంటున్నారు. ఎందుకంటే కొన్ని కొబ్బరి బొండంలో నీళ్లు తక్కువగా ఉంటాయి.. అయితే ఎక్కువగా నీళ్ళు ఉండే కొబ్బరిబొండంను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?

Also Read : కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగుతున్నారు? ఇలా చేస్తే అధిక ప్రయోజనాలు..

కొబ్బరి బొండమే కదా.. అని నిర్లక్ష్యంగా వదిలేస్తే డబ్బులు వృధాగా పోతాయి. కొన్ని ప్రాంతాల్లో కొబ్బరిబోండంను రూ .50కి విక్రయిస్తున్నారు. ఆసుపత్రి సమీపంలో వీటి ద్వారా మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంత ధర పెట్టి కొనుగోలు చేసిన సమయంలో కొబ్బరి బొండంలో నీళ్లు ఉన్నాయో లేవో తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొబ్బరి బొండం లో నీళ్లు ఎవరూ పోయరు.. కానీ ఇందులో నీళ్లు ఉన్నాయో లేవో ఎలా తెలుసుకోవాలి?

కొబ్బరి బొండం కొనుగోలు చేసేటప్పుడు దాని ముందు భాగం.. అంటే కాండం ఉన్న ప్రదేశంలో పచ్చగా ఉందో లేదో తెలుసుకోవాలి. ఇక్కడ పచ్చగా కాకుండా ఎండిపోయినట్లు ఉంటే అందులో నీళ్లు ఉండే అవకాశం తక్కువగానే ఉంటుంది. అయితే కొందరు ఈ కొబ్బరి బొండంలో కొట్టాలని చూస్తారు. దానిని వద్దని గ్రీన్ గా ఉన్నది మాత్రమే తీసుకోవాలి.

కొబ్బరి బోండాలు అన్నీ ఒకే విధంగా ఉండవు. కొన్ని పొడుగ్గా ఉంటాయి.. మరికొన్ని పొడుగ్గా ఉంటాయి. అయితే పొడుగ్గా ఉండే కొబ్బరి బొండాల్లో నీళ్లు తక్కువగా ఉంటాయి. గుండ్రంగా ఉండే కొబ్బరి బొండంలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సాధ్యమైనంతవరకు అన్న కొబ్బరి బొండాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల మీకు ప్రయోజనాలు ఉంటాయి.

కొన్ని కొబ్బరి బోండాలు పైన ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొందరు వ్యాపారులు తమ సేల్స్ ను పెంచుకునేందుకు వాటిని కొడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ నీళ్లు తియ్యగా ఉంటాయని చెబుతూ ఉంటారు. అయితే కొబ్బరి బొండం ఎక్కువ కాలం అయితే అందులో కొబ్బరి ఏర్పడి నీళ్లు తీయగా మారుతాయి. అంటే ఇందులో నీళ్లు తక్కువగా ఉంటాయన్నమాట. అందువల్ల పైన ఎండిపోయిన రకంగా ఉండే కొబ్బరి బొండాన్ని తీసుకోవద్దు.

కొన్ని కొబ్బరి బోండాలు గోధుమ రంగులో కూడా ఉంటాయి. అయితే గోధుమ రంగులో కొబ్బరి బొండం ఉన్నా.. ఇవి తాజాగా ఉంటే మాత్రమే తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు పచ్చగా ఉండి గుండ్రంగా ఉన్న కొబ్బరి బోండాలు మాత్రమే తీసుకోవాలని అంటున్నారు. ఇందులోనే నీటి శాతం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

Also Read : క్యాల్సియం, ఐరన్.. ఇంకా కొబ్బరి బొండంలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా?