https://oktelugu.com/

Coconut Water : కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగుతున్నారు? ఇలా చేస్తే అధిక ప్రయోజనాలు..

Coconut Water : వేసవికాలం రావడంతో చాలామంది చల్లదనాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆహార పానీయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

Written By: , Updated On : April 1, 2025 / 10:57 AM IST
Coconut Water

Coconut Water

Follow us on

Coconut Water : వేసవికాలం రావడంతో చాలామంది చల్లదనాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆహార పానీయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఎండవేడికి శరీరంలోని నీటి శాతం తగ్గుతూ ఉంటుంది. ఇది చెమట రూపంలో నిత్యం బయటకు వెళుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. ఇదే సమయంలో నీటి కంటెంట్ కలిగిన వాటిని తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందుతారు. అయితే తక్కువ ఖర్చులో డిహైడ్రేషన్ నుంచి తట్టుకోవడానికి కొబ్బరి నీళ్లు చాలా ఉత్తమమని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజు కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. అయితే ఈ కొబ్బరినీళ్లు ఎప్పుడు తాగాలి? వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరి నీళ్లలో తక్కువ చక్కెర కలిగి ఉంటుంది. అలాగే ఇందులో కేలరీల శక్తి కూడా తక్కువగానే ఉంటుంది. ఈ నీటిలో మెగ్నీషియంతో పాటు పొటాషియం ఫాస్ఫరస్ వంటి ఎలక్ట్రోలైట్స్ అధికంగా అందువల్ల కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి ఈ నీరే ఉత్తమం అని అంటున్నారు.

Also Read : చలికాలంలో కొబ్బరి నీరు తాగవచ్చా? తాగితే ఏమవుతుంది?

కొబ్బరి నీళ్లు ఉదయాన్నే తాగడం వల్ల ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పరిగడుపున వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొత్త ఎనర్జీని తీసుకువస్తుందని అంటున్నారు. అలాగే ఉదయాన్నే
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రోజంతా డీహైడ్రేషన్ కాకుండా ఉంటారని పేర్కొంటున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరంలో నీటి నిల్వ శాతం తగ్గకుండా చేస్తాయి. అలాగే అలసట బలహీనత లేకుండా ఈ నీళ్లు కాపాడుతూ ఉంటాయి. అందువల్ల ఉదయాన్నే కొబ్బరి నీళ్ళు తీసుకుని ప్రయత్నం చేయాలి. కొబ్బరి నీళ్లు తీసుకొని బయటకు వెళ్లిన ఎలాంటి ఎండ వేడి తగ్గకుండా ఉంటుంది.

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గుండెకు ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొత్త ఫోటో అధికంగా ఉండేవారు కొబ్బరినీళ్ళను రెగ్యులర్ గా తీసుకోవాలని చెబుతున్నారు. ఇందులో ఉండే సోడియం పొటాషియం శరీరంలోని కొత్త ప్రసరణను సక్రమంగా ఉండేలా చేస్తుంది. అలాగే భవిష్యత్తులో ఎలాంటి గుండె సమస్యలు లేకుండా చేస్తాయి.

బరువు తగ్గాలని అనుకునే వారు కొబ్బరి నీళ్లు తాగడం చాలా అవసరమని చెబుతున్నారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ నీరు తాగిన తర్వాత ఎలాంటి ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. అలాగే ఈ నీరు తాగిన తర్వాత ఎనర్జీ ఉంటుంది. హైపర్ అధికంగా ఉండడంతో ఫ్యాటీ కలిగిన ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. దీంతో బరువు ఉన్నవారు తగ్గుతూ ఉంటారు. అందువల్ల బరువు తగ్గాలని అనుకునేవారు కొబ్బరినీళ్లు తాగాలని చెబుతున్నారు.

కడుపులో మంట లేదా పేగుల్లో సమస్య ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగాలని చెబుతున్నారు. శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి కూడా కొబ్బరి నీరు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మూత్రంలో పేరుకుపోయిన హాని పదార్థాలను కూడా ఇది వెంటనే తీసివేస్తుంది. కిడ్నీ సమస్య ఉన్నవారు సైతం కొబ్బరినీరు తాగడం వల్ల ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Also Read : పరగడుపున కొబ్బరి నీరు తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?