Life partner
Life partner : భారతీయ సమాజంలో వివాహం బంధానికి(Marrage Bond) మంగి గుర్తింపు, గౌరవం ఉంది. పాశ్చాత్య సంస్కృతితో పోలిస్తే.. భారతీయ బంధాలు నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకుంటున్నాయి. అయితే ఇటీవల భారతీయ వైవాహిక బంధంలోకి కూడా పాశ్చాత్య సంస్కృతి చొరబడుతోంది. దీంతో బంధాలు బీటలు వారుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో జీవిత భాగస్వామిని ఎంచుకోవడం సవాల్‌గా మారింది.
Also Read : మీ భర్త పాదాలు ఇలా ఉన్నాయా.. మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు
మనిషి జీవితం ప్రస్తుతం యాత్రికంగా మారిపోయింది. యంత్రంలా పనిచేస్తేగానీ, బతకలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో పెళ్లి, పిల్లలు, కుటుంబం తదితర అంశాలపైనా యువతీ యువకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జీవిత భాగస్వామిని ఎంపిక(Life Partnar Selection) చేసుకోవడం విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తున్నారు. కానీ, జీవిత భాగస్వామి ఎంపిక అంత ఈజీ కాదంటున్నారు నేటితరం యువత. సాంప్రదాయ ఆచారాలు, ఆధునిక ఆలోచనలు, సామాజిక ఒత్తిడి వంటి అంశాలు ఈ ప్రయాణాన్ని సంక్లిష్టంగా మారుస్తున్నాయి.
సాంప్రదాయం VS ఆధునికత
గ్రామీణ ప్రాంతాల్లో వివాహాలు సాంప్రదాయ(Treditions) పద్ధతుల్లో జరుగుతాయి. కులం, మతం, జాతకం, ఆర్థిక స్థితి వంటి అంశాలు ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, హైదరాబాద్ వంటి నగరాల్లో యువత ఆధునిక ఆలోచనలను అవలంబిస్తున్నారు. వారు ప్రేమ వివాహాలు, వ్యక్తిగత ఆసక్తులు, విద్య, వత్తి వంటి అంశాలపై దష్టి సారిస్తారు. ఈ రెండు ఆలోచనల మధ్య సమతుల్యం కుదరకపోవడం వల్ల సరైన భాగస్వామి దొరకడం కష్టమవుతుంది.
కులం, మతం అడ్డంకులు
కులం, మతం(Cast, Religion)వివాహాల్లో పెద్ద సవాళ్లుగా ఉన్నాయి. చాలా కుటుంబాలు తమ కులం లేదా మతంలోనే సంబంధం చూడాలని కోరుకుంటాయి, ఇది ఎంపికలను పరిమితం చేస్తుంది. ఇష్టపడే వ్యక్తి వేరే కులం లేదా మతానికి చెందిన వారైతే, కుటుంబ ఒప్పందం పొందడం ఒక సమస్యగా మారుతుంది.
ఆర్థిక ఒత్తిడి, కట్నం
కట్నం(Dowry) ఇప్పటికీ సమస్యగా ఉంది. అమ్మాయి వైపు నుంచి కట్నం ఇవ్వాలని లేదా అబ్బాయి ఆర్థికంగా స్థిరంగా ఉండాలని డిమాండ్ చేయడం సర్వసాధారణం. ఈ ఆర్థిక ఒత్తిడి చాలా సంబంధాలను ముందుకు సాగనీయకుండా చేస్తుంది.
జాతకం, ఆచారాలు
జాతకం పొంతన చూడటం సాధారణం. జాతకాలు కలవకపోతే, సంబంధం ముందుకు సాగదు. రాశులు, నక్షత్రాలు, దోషాలు వంటి అంశాలు కూడా అడ్డంకులుగా మారతాయి.
ఆధునిక అంచనాలు
ఆధునిక జీవనశైలి(Life style) వల్ల భాగస్వామి విషయంలో అంచనాలు పెరిగాయి. విద్య, ఉద్యోగం, వ్యక్తిత్వం, జీవనశైలి కలవాలని యువత ఆశిస్తుంది. ఈ అంచనాలు సరిపోలకపోతే, సంబంధం కుదరడం కష్టం.
సామాజిక ఒత్తిడి
సమాజంలో ‘సరైన వయసు‘లో వివాహం చేసుకోవాలనే ఒత్తిడి ఎక్కువ. 25–30 ఏళ్లలోపు వివాహం చేయాలని బంధువులు, సమాజం ఒత్తిడి చేస్తాయి, ఇది ఆందోళనకు దారితీస్తుంది.
ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ సవాళ్లు
మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ యాప్‌లు సహాయపడుతున్నప్పటికీ, నకిలీ ప్రొఫైల్స్, తప్పుడు సమాచారం, ఎంపికల గందరగోళం వంటి సమస్యలు ఉన్నాయి.
సలహాలు
భాగస్వామి విషయంలో స్పష్టమైన అంచనాలు ఉంచుకోండి.
కుటుంబంతో నీ ఆలోచనలను చర్చించండి.
సమాజ ఒత్తిడికి లొంగకుండా సమయం తీసుకోండి.
విశ్వసనీయ మాధ్యమాల ద్వారా సంబంధాలు చూడండి.
వివాహం అనేది జీవితంలో ముఖ్యమైన నిర్ణయం. సరైన భాగస్వామి కోసం ఓపికగా వెతకడం, సమతుల్య దక్పథం ఉంచడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించవచ్చు.
Also Read : వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే!