Coconut shells : ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొబ్బరికాయను తప్పనిసరిగా కొడుతూ ఉంటాం. అలాగే ఇంట్లో పూజ నిర్వహించిన సమయంలో కూడా కొబ్బరికాయ లేకుండా ఉండదు. అయితే కొబ్బరికాయ కొట్టేంతవరకు దానికి వాల్యూ. కొట్టిన తర్వాత లోపలి కొబ్బరిని తీసుకొని చెక్కను పడేస్తూ ఉంటారు. ఎందుకంటే కొబ్బరి చిప్ప వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చాలామంది అనుకుంటూ దీనిని పెద్దగా పట్టించుకోరు. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం కొబ్బరి చిప్పలను వంట చెరుకుగా ఉపయోగిస్తారు. కానీ కొబ్బరి చిప్పలతో కోట్ల రూపాయలు కూడా సంపాదించవచ్చు అన్న విషయం చాలామందికి తెలిసి ఉండదు. మనదేశంలోనే కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి చిప్పలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇంతకీ కొబ్బరి చిప్పలకు ఎక్కడ డిమాండ్ ఉందో ఇప్పుడు చూద్దాం..
Also Read : కొబ్బరికాయ కొట్టిన తరువాత కుళ్లిపోతే ఎలాంటి సంకేతం? అందుకు ఏం చేయాలి?
మనకు పనికిరావు అనే కొబ్బరి చిప్పలతో కొందరు ఎన్నో రకాల ప్రయోజనాలను పొందుతున్నారు. కొబ్బరి చిప్ప ల ద్వారా బొగ్గును ఉత్పత్తి చేస్తుంటారు. మిగతా వాటి కంటే కొబ్బరి చిప్పతో తయారైన బొగ్గుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి చిప్పతో తయారైన బొగ్గులు పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. అందుకే దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ గా ఉంది. 2023 నాటికి దీని ప్రపంచ మార్కెట్ పరిమాణం సుమారు 315 మిలియన్ డాలర్లుగా ఉంది. వచ్చే పదివేలలో దీని వార్షిక అభివృద్ధి రేటు ఎనిమిది శాతంగా ఉంటుందని అంటున్నారు.
కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో కొబ్బరి చిప్పలను ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. ఒక కొబ్బరి చిప్పకు 50 పైసల విలువ ఇస్తున్నారు అంటే వీటి విలువ ఎంతో అర్థమవుతుంది. వీటి ద్వారా బొగ్గు మాత్రమే కాకుండా సహజమైన హెయిర్ ఆయిల్ ను తయారు చేస్తారు. అలాగే పేస్ క్రీమ్ ల కోసం లేదా ఇతర పదార్థాల తయారీకి కొబ్బరి చిప్పలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొబ్బరి చిప్పల్లో సహజమైన గుణాలు ఉండటంతో దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అలాగే కొబ్బరి చిప్ప నుంచి పీచును కూడా తీసేందుకు ప్రత్యేకంగా కర్మకారాలు ఉన్నాయి. తమిళనాడు నుంచి కొబ్బరి చిప్పలు లారీలో తరలిస్తూ ఉంటారు.
ప్రస్తుతానికి టన్ను కొబ్బరి పీచు రూ. 2,700గా పలుకుతోంది.. గతంలో రూ. 7 నుంచి 800 గా ఉండేది. దీంతో కొబ్బరి చిప్పలకు డిమాండ్ పెరిగిపోతుంది. అయితే చాలామందికి అవగాహన లేకుండా కొబ్బరిచిప్పలను వృధాగా పడేస్తున్నారు. వీటి గురించి తెలిస్తే.. అలాగే వీటి ద్వారా వచ్చే ఆదాయం గురించి తెలియడం ద్వారా ఎవరు విడిచిపెట్టి అవకాశం లేదు. కానీ కొబ్బరి చిప్పల గురించి ఎక్కువగా ఎవరూ ప్రచారం చేయడం లేదు. అయితే కర్ణాటకలో మాత్రం వీటికి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని షోరూమ్ లలో వీటికి ప్రత్యేక బోర్డులు కేటాయించి కొబ్బరి చిప్పలను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల కొబ్బరి చిప్పలను వృధాగా పడేయకుండా వాటిని సేకరించి ఉపయోగకరమైన వాటికి ఉపయోగించుకోవాలని అంటున్నారు.
Also Read : కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగుతున్నారు? ఇలా చేస్తే అధిక ప్రయోజనాలు..