Investment: ముఖ్యంగా చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత సౌకర్యవంతమైన జీవితం కోసం మంచి పెట్టుబడులు పెట్టే పథకాల కోసం ఆరా తీస్తూ ఉంటారు. ఈ క్రమంలో 15 సంవత్సరాల తర్వాత నెలకు 2 లక్షల రాబడిని అందించడానికి కేవలం నాలుగేళ్ల పాటు ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక నిపుణులు నెలవారి స్థిరమైన ఆదాయాన్ని అందించే నిధిని నిర్మించడానికి జాగ్రత్తగా మరియు ప్రాణాలిక వాస్తవిక ఆర్థిక అంచనాలు చాలా అవసరమని పెట్టుబడిదారులకు సూచిస్తున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి పెట్టేవాళ్లు భవిష్యత్తులో నెలకు రెండు లక్షలు సంపాదించడానికి అంటే వాళ్ళు సంవత్సరానికి రూ.24 లక్షల రాబడిని పొందడానికి ఇంటి నుంచి కేవలం నాలుగేళ్ల పాటు పెట్టుబడి పెడితే 15 ఏళ్ల తర్వాత రిటర్న్స్ తీసుకోవాల్సి ఉంటుంది. స్థిరమైన ఆదాయాన్ని పెట్టుబడులపై సంపాదించడం విస్తృతంగా ఆమోదించిన నియమం సురక్షిత ఉపసంహరణ రేటు పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇది ఒక ఏడాదికి నాలుగు శాతం ఉంటుంది. ఈ నియమం ప్రకారం మీరు మీ పొదుపులు చాలా త్వరగా క్షీణించే ప్రమాదం లేకుండా ప్రతి సంవత్సరం మీ మొత్తం కార్పస్ లో నాలుగు శాతం ఉపసంహరించుకోవచ్చు.
ఈ క్రమంలో మీరు నెలకు రెండు లక్షల ఆదాయం పొందడానికి రూ.6 కోట్ల కార్పస్ నిర్మించుకోవాల్సి ఉంటుంది. అయితే నాలుగు శాతం ఉపసంహరణ రేట్ పై ఈ అంచనా ఆధారపడి ఉంటుందని మీరు గమనించగలరు. ఇది కాలక్రమేనా మార్కెట్ అస్థిరత మరియు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పరిగణలోకి తీసుకొని మీ కార్పస్ అనేక దశాబ్దాల పాటు ఉండేలా చూసుకోవడానికి రూపొందించిన సాంప్రదాయ విధానంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానం ద్వారా మీ కార్పస్ రూ.6 కోట్లు అని తెలిసిన తర్వాత మీరు ప్రతి నెల ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుందో లెక్కించుకోవడం చాలా అవసరం.
మీరు పెట్టే పెట్టుబడులు పది శాతం వార్షిక రాబడి అంచనా వేస్తే నాలుగు సంవత్సరాలకు నెలకు రూ.3.70 లక్షలు పెట్టుబడి పెట్టాలి. మీరు నెలవారి పెట్టే పెట్టుబడులు ఆగిపోయిన తర్వాత 11 సంవత్సరాల లో మీ పెట్టుబడుల సమ్మేళన వృద్ధిలో ఈ గణన అంశం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో మీ ద్రవయోల్బణం మీ కార్పస్ విలువ మరియు మీరు ప్రతి నెల రెండు లక్షల నెలవారి ఆదాయం లక్ష్యంగా చేస్తున్న కొనుగోలు శక్తి రెండిటిని ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలో ఐదు నుంచి ఆరు శాతానికి స్థిరమైన ద్రవ్యోల్బణ రేటు 15 సంవత్సరాల లో మీ కొనుగోలు శక్తిని గణనీయంగా తగ్గిస్తుందని తెలుస్తుంది.