Click Photos Earn Money: చేతిలోకి మొబైల్ వచ్చిన తర్వాత చాలామంది దీనిని కాలక్షేపం కోసమే కాకుండా ఉపాధి కోసం కూడా వాడుతూ ఉన్నారు. ఉద్యోగులు, వ్యాపారులు సైతం మొబైల్ తో అనేక రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే మొబైల్ అనగానే మనకు ఎక్కువగా ఉపయోగపడేది ఫోటో స్టేషన్ కోసమే. చాలామంది బయట ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. మంచి సీనరీ కనిపించినప్పుడు.. వెంటనే కెమెరాతో క్లిక్ మనిపిస్తారు. నేటి కాలంలో వచ్చే కొత్త మొబైల్స్ లో హై రిజల్యూషన్ తో ఉన్న కెమెరాలు ఉండడంతో ఫ్యామిలీ ఫోటోలు సైతం వీటితోనే తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఫోటోలు తీసి కేవలం స్టోర్ చేసుకోవడమే కాకుండా వాటితో డబ్బులు కూడా సంపాదించవచ్చు. అది ఎలాగంటే?
Also Read: ఉద్యోగానికి పనికిరావని కేఎఫ్ సీ గెంటేసింది.. సీన్ కట్ చేస్తే..500 బిలియన్ డాలర్లకు ఎంపైరర్ అతడు!
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినాక చాలామంది ఆన్లైన్లో వర్క్ చేస్తున్నారు. ఒకవైపు సరదాగా ఉంటూనే.. మరోవైపు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు మొబైల్ లో ఉన్న కెమెరాతో ఫోటో తీసి కూడా ఉపాధి పొందవచ్చు. మీరు తీసిన మంచి ఫోటో అయితే దానికి మరిన్ని ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం రకరకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని వెబ్సైట్స్ కూడా ఇందుకు అవకాశం ఇస్తున్నాయి.ఫోటో ద్వారా సంపాదించే వెబ్సైట్లు లేదా యాప్ లు ఏవో ఇప్పుడు చూద్దాం..
కెమెరా తో తీసిన ఏ ఫోటో అయినా Adobestock అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చు. ఇలా వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఫోటోకు డబ్బులు చెల్లిస్తారు. దీనికి సంబంధించిన యాప్ కూడా అందుబాటులో ఉంటుంది. ఫోటో నాణ్యతను బట్టి రేటు నిర్ణయిస్తారు. అలాగే Shutterstock అనే వెబ్సైట్లో సైతం ఫోటోలు అప్లోడ్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో అప్లోడ్ చేసిన ఫోటోలకు డబ్బులు ఇవ్వడమే కాకుండా.. వాటిని డౌన్లోడ్ చేసుకున్న ప్రతిసారి రాయితీ ఇస్తూ ఉంటారు. అలాగే మరో యాప్ Snapwire అనే యాప్ సైతం యువకులకు ఉపాధి పొందడానికి మంచి మార్గం. ఇందులో కూడా ఫోటో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. వీటితోపాటు pop అనే యాప్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: విరాట్ కోహ్లీ హెయిర్ కటింగ్ ఖర్చు లక్షా 18వేలు.. అంత ఎందుకంటే?
ఇలా మీరు కెమెరాతో తీసిన ఫోటోను వృధా కాకుండా ఆయా వెబ్సైట్ లేదా యాప్ లో అప్లోడ్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. అయితే కెమెరా నాణ్యత నువ్వు బట్టి ఫోటోకు రేటింగ్ ఇస్తారు. ఇందులో ఏ క్యాటగిరి అయితే ఆ కేటగిరికి సంబంధించిన వివరాలను అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఫోటో అప్లోడ్ చేయాలంటే ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కావాల్సిన ఫోటోలను అప్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనికి కాస్త టైం తీసుకుంటే కావాల్సిన డబ్బులు సంపాదించుకోవచ్చు.