KFC Rejection Story: ఒక మనిషి జ్ఞానాన్ని అంచనా వేయడానికి అతడు చదివిన చదువు కొలమానం కాదు. ఒక వ్యక్తి సామర్థ్యాన్ని గుర్తించడానికి అతడికున్న డిగ్రీలు కొలబద్ద కాదు. అతడి మెదడులో ఉన్న ఆలోచన.. అతడికున్న విషయపరిజ్ఞానం.. స్థాయిని నిర్దేశిస్తాయి. ఇవి గుర్తుంచకుండా ఆ వ్యక్తి ఎగతాళి చేస్తే.. ఎదురైన ప్రతిబంధకాలను దాటుకుంటూ ఎక్కడికో వెళ్లిపోతాడు. అలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read: నిర్మాణ రంగంలో ఇదో గేమ్ చేంజర్
అతడం ఆరడుగుల ఆజానుబాహుడు కాదు. అతడికి వ్యాపార నేపథ్యం లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే చైనా దేశంలో ఒక సామాన్య కుటుంబం. పైగా అతడు గొప్ప చదువరి కాదు. విషపరిజ్ఞానం ఉన్న వ్యక్తి అంతకన్నా కాదు.. ప్రాథమిక విద్యలో రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు. మిడిల్ స్కూల్లో మూడుసార్లు ఫెయిల్ అయ్యాడు. యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో మూడుసార్లు విఫలమయ్యాడు.. అతడు వరుసగా విఫలమవుతుంటే ఉపాధ్యాయులు, అధ్యాపకులు హొప్ లెస్ క్యాండెట్ అని నిర్ధారించారు.
అప్పట్లో చైనాలో కేఎఫ్ సీ అవుట్ లెట్స్ ఓపెన్ చేస్తోంది. ఇందులో పని చేయడానికి సిబ్బందిని నియమించుకుంటున్నది. చైనాలో ఏర్పాటు చేయబోయే ఒక అవుట్ లెట్ లో 24 మంది సిబ్బంది కావాలని నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి ఆ వ్యక్తి హాజరయ్యాడు. వాస్తవానికి ఆ ఉద్యోగాలకు 24 మంది మాత్రమే వచ్చారు. 23 మందిని ఎంపిక చేసిన యాజమాన్యం.. ఆ వ్యక్తికి మాత్రం ఉద్యోగం ఇవ్వలేదు. అతని వైఫల్య చరిత్ర అక్కడితోనే ఆగిపోలేదు. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రవేశం పొందడానికి అతడు పదిసార్లు విఫలయత్నం చేశాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు 500 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా కొనసాగుతున్నాడు. అతడే ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా.
Also Read: హాట్ బెడ్డింగ్..డబ్బు సంపాదనకు ఈ యువతికి అదే మార్గం..
వరుసగా ఉద్యోగాలకు ఎంపిక కాలేకపోతున్నప్పటికీ జాక్ మా ఇబ్బంది పడలేదు.. తొలిసారిగా అమెరికా వెళ్ళిన అతడు.. ఐటీ విప్లవాన్ని ముందుగానే పసిగట్టాడు. దానికంటే ముందు అక్కడ ఒక టీచర్ గా జాయిన్ అయ్యాడు. అప్పట్లో అతని వేతనం నెలకు 12 డాలర్లుగా ఉండేది. అదే సమయంలో అతడి స్నేహితులు జాక్ మా కంటే పదిరెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. అయినప్పటికీ వారితో జాక్ మా పోల్చుకోలేదు. ఒకసారి సిలికాన్ వ్యాలీలో అతడు వెళ్తుండగా అక్కడి పరిస్థితులను గమనించాడు. ఐటి విప్లవం భవిష్యత్తు కాలంలో సంచలనాలు సృష్టిస్తుందని నమ్మాడు. ఆ తర్వాత చైనాలో ఫస్ట్ వెబ్సైట్ ప్రారంభించాడు. తొలి రోజుల్లో అతడికి ఊహించిన స్థాయిలో లాభాలు రాలేదు. కనీసం నిర్వహణ ఖర్చులు కూడా రాలేదు. ఈ సమయంలో అతడు తీవ్రంగా కష్టపడ్డాడు. ఇదే నేపథ్యంలో దాదాపు 8 లక్షల డాలర్లను సంపాదించాడు. దీనికోసం మూడు సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. ఆ తర్వాత ఆలీబాబా కంపెనీని మొదలుపెట్టాడు. ఇక అతడు వెనుతిరిగి చూసుకోలేదు. దినదిన ప్రవర్తమానంగా ఎదిగాడు. ఒక శక్తిగా ఆవిర్భవించాడు. దాదాపు 500 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అంతేకాదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ప్రస్తుతం చైనాలో అతిపెద్ద శ్రీమంతులలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఒకప్పుడు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన కంపెనీలు.. ఇప్పుడు అతడి చుట్టూ క్యూ కడుతున్నాయి. అతని అపాయింట్మెంట్ లభిస్తే చాలు జన్మ ధన్యం అన్నట్టుగా ఫీల్ అవుతున్నాయి. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. తక్కువ చూపు చూడకూడదు.