Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ మధ్య చిన్న పెద్ద తేడాలు లేకుండా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆందోళన మొదలు అయింది. అసలు ఇది ఎందుకు వస్తుంది? అందుకు గల కారణాలు ఏమిటి? వీటి లక్షణాలు ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి..? అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Written By: Vadde, Updated On : August 21, 2024 8:30 pm

Brain Stroke

Follow us on

Brain Stroke: ప్రస్తుతం ఎవరికి ఎలాంటి అనారోగ్యం వస్తుందో తెలుసుకోవడం కష్టమే. చదువుతున్న మీకు, రాస్తున్న నాకు కూడా సడన్ గా ఏదైనా అవచ్చు. కాలం మారింది. ఆహారం పట్ల జాగ్రత్త పడటం లేదు. బిజీ లైఫ్ సో ఆరోగ్యం గురించి చింతించాల్సిందే. అందుకే ఆరోగ్యం పట్ల అవగాహనతో ఉండాలి. ఆరోగ్యమే మహా భాగ్యం. టైంకి తిండి, సరైన నిద్ర మస్ట్ గా ఉండాలి. వీటితో పాటు వ్యాయామం తప్పకుండా ఉంటే మీ శరీరం అనుకూలంగా ఉంటుంది. కొన్ని మార్పులు చేసుకోకపోతే మీకు కచ్చితంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు శరీరం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొకపోతే మీరు మరింత ఎక్కువ ప్రమాదంలో ఉంటారు.

ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ మధ్య చిన్న పెద్ద తేడాలు లేకుండా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆందోళన మొదలు అయింది. అసలు ఇది ఎందుకు వస్తుంది? అందుకు గల కారణాలు ఏమిటి? వీటి లక్షణాలు ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి..? అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

బ్రెయిన్ స్ట్రోక్ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని బాధ పెడుతుంది. పెద్దవారికి మాత్రమే కాదు చిన్న వారికి కూడా ఈ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి స్మోకింగ్ ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. రాత్రుల్లో మెలకువగా ఉండి ఫోన్ చూడడం ఎక్కువగా ఆలోచించడం వల్ల ఈ స్ట్రోక్ ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుందట. బ్రెయిన్ స్ట్రోక్ వలన మనిషి మృతి చెందే అవకాశం కూడా ఎక్కువే ఉంటుంది అంటున్నారు వైద్యులు.

బ్రెయిన్ స్ట్రీక్ వస్తే ఎక్కువగా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. కుడి చేతి, ఎడమ కాలు పడిపోవడం వంటివి దీని లక్షణాలు అంటున్నారు నిపుణులు. బ్రెయిన్ లో ఏ చిన్న నరం వద్ద బ్లడ్ ఆగిపోయినా, కట్ అయినా సరే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దీన్ని అరికట్టేందుకు బీపి, షుగర్ సరిగ్గా చూసుకుంటూ మంచి పోషక పదార్థాలు, ఆకు కూరలు తీసుకుంటూ యోగ వ్యాయమం వంటివి చేస్తుంటే మీరు స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు.

బ్రెయిన్ స్ట్రోక్ లో మూడు రకాలు ఉంటాయట. ముఖ్యంగా అర్దరాత్రి వరకు ఫోన్ ను చూడటం వల్ల కంటిచూపు సరిగా కనబడదు. నిద్ర లేకపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండడానికి ప్రధానంగా ఆల్కహాల్ కారణం అవుతుంది. ఒత్తిడి, బీపీ, షుగర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ నుంచి బయటపడవచ్చు.

ప్రధాన లక్షణాలు..చేయి లేదా కాలులో ఆకస్మిక తిమ్మిరి రావడం. బలహీనత, ఆకస్మిక గందరగోళం, మాట్లాడటం ఇబ్బంది, యాస పోవడం, మాట పడిపోవడం, ఆకస్మికంగా దృష్టి కోల్పోవడం, నడకలో ఇబ్బంది, మైకము వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. ఆకస్మిక అసాధారణమైన తలనొప్పి, ఇది మెదడులో రక్తస్రావం ద్వారా సంభవించే బ్రెయిన్ స్ట్రోక్‌కి సంకేతం కావచ్చు. వికారం, వాంతులు. స్ట్రోక్ సాధారణ లక్షణం. ఇలా చాలా లక్షణాలు ఉంటాయి. సో జాగ్రత్త.